logo

హస్తిన వీధుల్లో చందన శకటం..

అటు చూస్తే శ్రీగంధం బొమ్మలు.. ఇటు చూస్తే మైసూరు వన్నెచిన్నెల చీరలు.. దంతం ముక్కలతో చక్కగా తీర్చిదిద్దిన గజరాజు బొమ్మ.. వేటికవే ప్రత్యేకం. మరపురాని కళా, సంస్కృతుల మేళవింపుగా అందరినీ ఆకట్టుకుంది కర్ణాటక శకటం! గణతంత్ర వేడుకల ప్రధాన వేదిక..

Published : 27 Jan 2022 00:39 IST

అటు చూస్తే శ్రీగంధం బొమ్మలు.. ఇటు చూస్తే మైసూరు వన్నెచిన్నెల చీరలు.. దంతం ముక్కలతో చక్కగా తీర్చిదిద్దిన గజరాజు బొమ్మ.. వేటికవే ప్రత్యేకం. మరపురాని కళా, సంస్కృతుల మేళవింపుగా అందరినీ ఆకట్టుకుంది కర్ణాటక శకటం! గణతంత్ర వేడుకల ప్రధాన వేదిక.. దిల్లీలో ఆబాల గోపాలాన్నీ బుధవారం ఆకట్టుకున్న కదిలే సంభ్రమమిదీ! చెన్న పట్టణ, కిన్నాళె కలప బొమ్మలే కాదండోయ్‌.. కరావళి ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చిన యక్షగాన కళాకారుల నర్తనమూ ఈ శకటంతో పాటే సాగుతుంటే.. ఈ వేడుక కనుల పండుగే కదా! 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని