logo

నోరు విప్పితే.. సర్కారు పతనం

రాష్ట్రాన్ని కుదిపేస్తున్న పీఎస్‌ఐ నియామక పరీక్షల్లో అక్రమాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి ఈ విషయమై హాసన జిల్లాలో మాట్లాడుతూ అక్రమాలకు ఆద్యుడెవరో తాను పేరు వెల్లడిస్తే ప్రభుత్వమే కూలిపోతుందన్నారు

Updated : 07 May 2022 05:58 IST

కుమారస్వామి మాజీ ముఖ్యమంత్రి

బెంగళూరు (ఎలక్ట్రానిక్‌ సిటీ), న్యూస్‌టుడే : రాష్ట్రాన్ని కుదిపేస్తున్న పీఎస్‌ఐ నియామక పరీక్షల్లో అక్రమాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి ఈ విషయమై హాసన జిల్లాలో మాట్లాడుతూ అక్రమాలకు ఆద్యుడెవరో తాను పేరు వెల్లడిస్తే ప్రభుత్వమే కూలిపోతుందన్నారు. మూలకారకుడిని తాకాలంటేనే భాజపాకు ధైర్యం లేదని- అందుకే అక్రమాలకు అంతులేకుండా ఉందన్నారు. సహాయ అధ్యాపకుల నియామకాల్లోనూ ఐదు వందల మందికి పైగా అభ్యర్థులకు ప్రశ్నపత్రాలు అందాయన్నారు.

హోంశాఖ మంత్రి అరగ జ్ఞానేంద్ర ఈ వ్యాఖ్యలకు స్పందిస్తూ ప్రభుత్వం కూలినా ఫరవాలేదని- అక్రమాలకు కారకుడెవరో వెల్లడించాలని మాజీ ముఖ్యమంత్రికి సవాల్‌ విసిరారు. కేవలం ఏదో ఆరోపణలు చేసి తప్పుకోవడం కాదని- వాస్తవాలేమిటో వెల్లడించాలన్నారు. కలబురగిలో ఆయన తనను కలుసుకున్న విలేకరులతో మాట్లాడారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు. అక్రమాలకు అవసరమైన దాఖలాలేమిటో వెల్లడిస్తే ప్రభుత్వమే తగిన చర్యలు తీసుకుంటుందని చెప్పారు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని