logo
Published : 20 May 2022 02:13 IST

వారంతా.. చదువలమ్మ వారసులు

హావేరి జిల్లా హళేమన్నంగి : రైతుబిడ్డ ప్రవీణ్‌ బసనగౌడతో తల్లిదండ్రుల సంబరం

బెంగళూరు (ఎలక్ట్రానిక్‌ సిటీ), న్యూస్‌టుడే : కనీవినీ ఎరుగని రీతిలో పదో తరగతి పరీక్షల్లో వారంతా రాణించారు. 625 మార్కులకు 625 సాధించి సరస్వతికి అసలైన వారసులుగా నిలిచారు. తొలిసారిగా రాష్ట్రంలో ఏకంగా 145 మందికి ఆ ఘనత లభించింది. అలాంటి వారిలో వీరు కొందరు. పరీక్షా ఫలితాల్ని ప్రకటించగానే వందశాతం మార్కులను సాదించినట్లు తెలియజేయడంతో వారి ఆనందానికి అవధుల్లేవు. వీరిలో మరో విశేషం కూడా దాగి ఉంది. ఈ ఘనత సాధించిన వారిలో అధికశాతం మంది సాధారణ కుటుంబాల నుంచి వచ్చినవారు. అంతేకాదండోయ్‌! అనేకమంది ప్రభుత్వ పాశశాలల్లో చదివినవారే. వీరు సాధించిన ఈ ఘనత ప్రభుత్వ పాఠశాలలంటే చిన్నచూపు చూసేవారికి కనువిప్పు కల్గిస్తుందని విద్యావేత్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

సప్లిమెంటరీ పరీక్షలు..

బెంగళూరు (శివాజీనగర): పదో తరగతి పరీక్షల ఫలితాలతో పాటే సప్లిమెంటరీ పరీక్షల తేదీలను ఎస్‌ఎస్‌ఎల్‌సీ బోర్డు ప్రకటించింది. జూన్‌ 27 నుంచి జులై 4 వరకు ఇవి ఉంటాయని అధికారులు తెలిపారు. మే 30లోగా విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఈ విద్యాసంవత్సరం, గతంలో ఉత్తీర్ణత సాధించని విద్యార్థులూ దరఖాస్తు చేసుకోవచ్ఛు జూన్‌ 27న సైన్సు, పొలిటికల్‌ సైన్సు, కర్ణాటక/ హిందూస్తానీ సంగీతం, జూన్‌ 28న ప్రథమ భాష (కన్నడ, తెలుగు, హిందీ, మరాఠి, తమిళం, ఉర్దూ, సంగీతం, ఆంగ్లం, సంస్కృతం), జూన్‌ 29న ద్వితీయ భాష (ఆంగ్లం, కన్నడం), జూన్‌ 30న సోషల్‌ సైన్స్‌, జులై 1న తృతీయ భాష (హిందీ, కన్నడ, ఆంగ్లం, అరబిక్‌, పర్షియన్‌, ఉర్దూ, సంస్కృతం, కొంకణి, తుళు), జులై 2న ఆర్థిక శాస్త్రం, జులై 4- గణితం, సైన్సు పరీక్షలు ఉంటాయి. ఒక సబ్జెక్ట్‌కు రూ.370, రెండింటికి రూ.461, మూడు లేదా అంతకు మించిన సబ్జెక్టులకు రూ.620 చెల్లించాలని అధికారులు సూచించారు.

 

బెళగావి : అమోఘ్‌ కౌశికను అభినందిస్తున్న తల్లిదండ్రులు

కుందాపుర తాలూకా కాళవారకు చెందిన నిశా

హావేరి జిల్లా గురుభవన్‌ కాపలాదారుడు బసవరాజ్‌ శేతసనది కుమార్తె మధు శేతసనది

చిత్రదుర్గ జిల్లా హొసదుర్గ తాలూకా కబ్బళ గ్రామానికి చెందిన కె.ఎం.సించనా

విజయపుర జిల్లా కారజోళ రాణి చెన్నమ్మ ఆశ్రమ పాఠశాల విద్యార్థిని స్వాతి మాళేద

తల్లిదండ్రులతో విద్యార్థిని ఏక్తా

విజయపుర జిల్లా జుమనాళ నివాసి అమిత్‌కు మిఠాయిల్ని తినిపిస్తున్న బంధువులు

Read latest Karnataka News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని