logo

చరవాణి టవర్‌ కూలి కార్మికులకు గాయాలు

అంజనాద్రి వద్ద నిర్మాణ దశలో ఉన్న మొబైల్‌ టవర్‌ కూలిపోయి కార్మికులు గాయపడ్డ సంఘటన గురువారం జరిగింది. పార్కింగ్‌ స్థలంలో ఓ సంస్థ ఈ మొబైల్‌ టవర్‌ను నిర్మిస్తోంది. 40 శాతం పనులు పూర్తయ్యాయి. కార్మికులు టవర్‌ నిర్మాణంలో నిమగ్నమై ఉండగా హఠాత్తుగా కూలిపోయింది.

Published : 20 May 2022 02:13 IST

అంజనాద్రి వద్ద కుప్పకూలిన టవర్‌

గంగావతి,న్యూస్‌టుడే: అంజనాద్రి వద్ద నిర్మాణ దశలో ఉన్న మొబైల్‌ టవర్‌ కూలిపోయి కార్మికులు గాయపడ్డ సంఘటన గురువారం జరిగింది. పార్కింగ్‌ స్థలంలో ఓ సంస్థ ఈ మొబైల్‌ టవర్‌ను నిర్మిస్తోంది. 40 శాతం పనులు పూర్తయ్యాయి. కార్మికులు టవర్‌ నిర్మాణంలో నిమగ్నమై ఉండగా హఠాత్తుగా కూలిపోయింది. ఉత్తర భారతానికి చెందిన ముక్తార్‌, రషీద్‌, గుల్జార్‌, నాసిర్‌, సల్మాన్‌, నజీర్‌ అనే కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స కోసం గంగావతి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. రెవెన్యూ అధికారులు, గ్రామీణ పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు