logo
Published : 20 May 2022 02:13 IST

కార్ఖానాల నీటి వినియోగం లెక్కింపునకు మీటర్లు

కొప్పళ ప్రగతి పరిశీలననలో సమీక్షిస్తున్న జిల్లా భాద్య మంత్రి ఆనంద్‌సింగ్‌

గంగావతి, న్యూస్‌టుడే: తుంగభద్ర జలాశయం వెనుక జలాల నుంచి నీటిని వాడుకుంటున్న కార్ఖానాల జాక్‌వెల్‌లకు మీటర్లు అమర్చాలని కొప్పళ జిల్లా బాధ్య మంత్రి ఆనంద్‌సింగ్‌ సూచించారు. ఆయన గురువారం జిల్లా ప్రగతిని సమీక్షించారు. వెనుక జలాలు, కాలువల నీటిని కార్ఖానాలు వాడుకునేందుకు ప్రభుత్వం అనుమతించిందన్నారు. కేటాయించిన దానికన్నా అధికంగా వాడుకుంటున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయన్నారు. మీటర్‌ రీడింగ్‌ వ్యవస్థను సంబంధిత ఇంజినీరింగ్‌ కార్యాలయంలో ఏర్పాటు చేయాలన్నారు. ఫలితంగా తుంగభద్ర జలాల దుర్వినియోగాన్ని అరికట్టవచ్చన్నారు. తొలకరి వానల నష్టంపై వాస్తవ నివేదికలు రూపొందించాలన్నారు. జిల్లా ప్రభుత్వం ఆసుపత్రితో పారిశుద్ధ్య లోపంపై ఫిర్యాదులు అందుతున్నాయని, ఒప్పంద కార్మికుల పనితీరుపై నిఘా పెట్టాలన్నారు. అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఎం.బి.బి.ఎస్‌. వైద్యులను నియమించాలన్నారు. అళవండి, బెటేరి, బహద్దూర్‌ బండి ఎత్తిపోతలను 40 రోజుల్లో పూర్తి చేయాలని సూచించారు. జిల్లాలో ఎల్‌అండ్‌టీ సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్న జలజీవన్‌ పనులు జూన్‌ చివరికల్లా పూర్తి కావాలన్నారు. సమావేశంలో గనులశాఖ మంత్రి హాలప్పా ఆచార్‌, లోక్‌సభ సభ్యుడు సంగణ్ణ కరడి, శాసనసభ్యులు రాఘవేంద్ర, పరణ్ణ, జిల్లా పాలనాధికారి వికాస కిశోర్‌, ఎసీ్పీ అరుణాంగ్షు గిరి, జడ్పీ సీఈవో ఫౌజియా తరున్నమ్‌ పాల్గొన్నారు.

Read latest Karnataka News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని