logo

వాన తగ్గినా.. జోరుగా వరద

అకాల వర్షాలు తగ్గుముఖం పట్టినా వరద ప్రవాహం కొనసాగుతుండడంతో జలాశయాలు కొత్త కళ సంతరించుకున్నాయి. మొన్నటి వరకూ ఎండిన వాగులన్నీ ప్రమాదస్థాయిని మించి దూకుడు ప్రదర్శిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా వేలాది హెక్టార్లలో పొలాలు నీటమునిగి రైతుల్ని నిలువునా ముంచెత్తగా.

Published : 22 May 2022 01:55 IST

దావణగెరె జిల్లా దేవరబెళకెరి జలాశయం నుంచి నీటి విడుదల

బెంగళూరు (ఎలక్ట్రానిక్‌ సిటీ): అకాల వర్షాలు తగ్గుముఖం పట్టినా వరద ప్రవాహం కొనసాగుతుండడంతో జలాశయాలు కొత్త కళ సంతరించుకున్నాయి. మొన్నటి వరకూ ఎండిన వాగులన్నీ ప్రమాదస్థాయిని మించి దూకుడు ప్రదర్శిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా వేలాది హెక్టార్లలో పొలాలు నీటమునిగి రైతుల్ని నిలువునా ముంచెత్తగా.. వాస్తవానికి ఏమేరకు నష్టం వాటిల్లిందో తేల్చేందుకు రెవెన్యూ, వ్యవసాయశాఖ అధికారులు సమాయత్తమయ్యారు. మరో రెండు మూడు రోజుల్లో వాస్తవ వివరాలు వెల్లడికానున్నాయి. శుక్రవారం సాయంత్రం నుంచి శనివారం ఉదయం వరకు కురిసిన వర్షపాతం వివరాల్లోకెళ్తే.. హావేరి జిల్లా గుత్తల్‌లో 12 సెంటీమీటర్ల వర్షం కురిసింది. అథణి 6, ఖజూరి, ముధోళ్‌ 5, ముల్కి, ముండగోడు, సవణూరు, అక్కలూరు, పొన్నంపేటె, హగరిబొమ్మనహళ్లి 4, మంగళూరు, పణంబూరు, హళియాళ, సదలగా, శిగ్గాంవ్‌, లక్ష్మేశ్వర, రోణ, బీళగి, రబకవి, మన్నాళి, అళంద, శ్రీమంగల, శృంగేరి, అణ్ణిగెరె, యల్లాపుర, కుమటా, గోకర్ణ, బాదామిలో రెండు సెంటీమీటర్ల వర్షం కురిసింది. అనేక ప్రాంతాల్లో ఓమోస్తరు వర్షం కురిసింది. రాబోయే రెండు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని