logo

పోలీస్‌ శాఖలో మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యం

జిల్లాలోని సండూరు తాలూకా చోరునూరులో రూ.3.58 కోట్లతో నూతన పోలీస్‌ స్టేషన్‌ నిర్మాణానికి రాష్ట్ర రవాణా, గిరిజన సంక్షేమ శాఖ, జిల్లా బాధ్య మంత్రి బి.శ్రీరాములు, లోక్‌సభ సభ్యుడు వై.దేవేంద్రప్ప, శాసనసభ్యుడు ఇ.తుకారాం, జిల్లా పాలనాధికారి పవన్‌కుమార్‌ మాలపాటి, జిల్లా పోలీస్‌ అధికారి సైదులు అడావత్‌లు శనివారం భూమిపూజ చేశారు

Published : 22 May 2022 01:55 IST

పోలీస్‌ స్టేషన్‌ నిర్మాణానికి భూమిపూజ చేస్తున్న

మంత్రి శ్రీరాములు, శాసనసభ్యుడు తుకారాం తదితరులు

బళ్లారి, న్యూస్‌టుడే : జిల్లాలోని సండూరు తాలూకా చోరునూరులో రూ.3.58 కోట్లతో నూతన పోలీస్‌ స్టేషన్‌ నిర్మాణానికి రాష్ట్ర రవాణా, గిరిజన సంక్షేమ శాఖ, జిల్లా బాధ్య మంత్రి బి.శ్రీరాములు, లోక్‌సభ సభ్యుడు వై.దేవేంద్రప్ప, శాసనసభ్యుడు ఇ.తుకారాం, జిల్లా పాలనాధికారి పవన్‌కుమార్‌ మాలపాటి, జిల్లా పోలీస్‌ అధికారి సైదులు అడావత్‌లు శనివారం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా విలేకరులతో మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్‌శాఖను బలోపేతం చేయడానికి ముఖ్యమంత్రి, హోంమంత్రి శ్రమిస్తున్నారన్నారు. పోలీస్‌ శాఖలో మౌలిక సౌకర్యాలు కల్పించడానికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తున్నట్లు తెలిపారు. జనాభాకు అనుగుణంగా పోలీసులను పెంచడం వల్ల నేరాలు సంఖ్య తగ్గుముఖం పడతాయన్నారు. నేరులను కూడా తక్షణమే పరిష్కారానికి అనుకూలంగా ఉంటుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్‌ వసతి పథకం కింద రూ.2000 కోట్లతో మొత్తం 10,034 గృహాలను నిర్మిస్తున్నట్లు తెలిపారు. భూమిపూజ కార్యక్రమానికి ముందు మంత్రి, ఎమ్మెల్యేలు, అధికారులు గ్రామంలో ఊరేగింపుగా వచ్చారు. అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని