logo

అధిక ధరలకు విత్తనాలు విక్రయిస్తే చర్యలు

విత్తనాలు నిర్ణయించిన ఎం.ఆర్‌.పి. కంటే ఎక్కువకు విక్రయిస్తే దుకాణదారులపై చర్యలు తీసుకుంటామని వ్యవసాయ శాఖ అధికారి నజీర్‌ అహ్మద్‌ హెచ్చరికలు చేశారు. కొద్ది రోజులుగా వర్షాలు పడుతుండటంతో రైతులు మిరప, పత్తి, పొద్దుతిరుగుడు, సజ్జ, జొన్న తదితర విత్తనాలు కొనుగోలు చేసేందుకు విత్తనాల దుకాణాలకు తరలి వెళ్తున్నారు.

Published : 22 May 2022 01:55 IST

విత్తన దుకాణంలో దాఖలాలు పరిశీలిస్తున్న వ్యవసాయ శాఖ అధికారులు

సిరుగుప్ప, న్యూస్‌టుడే : విత్తనాలు నిర్ణయించిన ఎం.ఆర్‌.పి. కంటే ఎక్కువకు విక్రయిస్తే దుకాణదారులపై చర్యలు తీసుకుంటామని వ్యవసాయ శాఖ అధికారి నజీర్‌ అహ్మద్‌ హెచ్చరికలు చేశారు. కొద్ది రోజులుగా వర్షాలు పడుతుండటంతో రైతులు మిరప, పత్తి, పొద్దుతిరుగుడు, సజ్జ, జొన్న తదితర విత్తనాలు కొనుగోలు చేసేందుకు విత్తనాల దుకాణాలకు తరలి వెళ్తున్నారు. ఒక్కసారిగా రైతులు రావడంతో విత్తన విక్రయదారులు నిర్ణయించిన ధరలకంటే ఎక్కువకు విత్తనాలు విక్రయిస్తున్నారని రైతులు వ్యవసాయ శాఖ అధికారులకు సమాచారం అందించారు. శుక్రవారం, శనివారం వ్యవసాయ అధికారి నజీర్‌ అహ్మద్‌, సహాయక అధికారి గర్జప్ప, సిబ్బంది విక్రయ దుకాణాలకు వెళ్లి క్రయ, విక్రయ దాఖలాలు పరిశీలించారు. ఎం.ఆర్‌.పి. కంటే ఎక్కువకు విక్రయించరాదని, విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులు కూడా కొనుగోలు చేసిన విత్తనాలకు తప్పనిసరిగా బిల్లు పొందాలని సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని