logo

బసవేశ్వరుడే మార్గదర్శి

సమాజంలో అసమానతలకు వ్యతిరేకంగా సాంఘిక విప్లవకారుడు బసవేశ్వరుడు జీవితాంతం పోరాటం చేశారని మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప కొనయాడారు. ఆయన బాటలో నేటితరం నడవాలని పిలుపునిచ్చారు. బెంగళూరులోని ప్రభుత్వ

Published : 23 May 2022 01:38 IST

రాజకీయ కురువృద్ధుడు డాక్టర్‌ భీమణ్ణ ఖండ్రెను సత్కరిస్తున్న

మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప, మాజీ మంత్రి శామనూరు

శివశంకరప్ప, పీసీసీ కార్యాధ్యక్షుడు ఈశ్వరఖండ్రె తదితరులు

బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్‌టుడే : సమాజంలో అసమానతలకు వ్యతిరేకంగా సాంఘిక విప్లవకారుడు బసవేశ్వరుడు జీవితాంతం పోరాటం చేశారని మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప కొనయాడారు. ఆయన బాటలో నేటితరం నడవాలని పిలుపునిచ్చారు. బెంగళూరులోని ప్రభుత్వ రవీంద్ర కళాక్షేత్రంలో అఖిల భారత వీరశైవ లింగాయత మహాసభ ఆదివారం ఏర్పాటు చేసిన బసవ జయంతి కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి ప్రసంగించారు. నేటి సమాజంలోనూ సమూల మార్పులు ఎంతో అవసరమని, ఆదర్శవాదానికి ఊతమివ్వాలని పిలుపునిచ్చారు. బసవేశ్వరుడు చూపిన బాటలోనే ఆదర్శవాదులు అడుగులు వేస్తున్నారని వివరించారు. ఆ సిద్ధాంతాల బాటలోనే వందేళ్లు పూర్తి చేసుకున్న రాజకీయ కురువృద్ధుడు భీమణ్ణ ఖండ్రె చేసిన సేవలను సమాజం గుర్తించుకోవాలని సూచించారు. ఈసందర్భంగా డాక్టర్‌ భీమణ్ణను సత్కరించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి శామనూరు శివశంకరప్ప, డాక్టర్‌ ఎన్‌.తిమ్మణ్ణ, పీసీసీ కార్యాధ్యక్షుడు ఈశ్వర ఖండ్రె, మాజీ మేయర్‌ గంగాంబికె, మాజీ ఉపమేయర్‌ పుట్టరాజు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని