logo

గూడ్సులో బస్సుల తరలింపు

కర్ణాటక రాష్ట్రం దొడ్డబళ్లాపురలోని అశోక్‌ లేల్యాండ్‌ బస్సు కోచ్‌ల తయారీ పరిశ్రమ నుంచి ఉత్తర భారత్‌కు పెద్ద సంఖ్యలో బస్సులు తరలివెళ్లాయి. హిమాచల్‌ రోడ్‌ ట్రాన్స్‌పోర్టు కార్పొరేషన్‌ కోసం స్థానికంగా తయారు చేసిన 32 బస్సులను గూడ్సు రైల్లో శనివారం

Published : 23 May 2022 01:38 IST

బెంగళూరు (గ్రామీణం), న్యూస్‌టుడే : కర్ణాటక రాష్ట్రం దొడ్డబళ్లాపురలోని అశోక్‌ లేల్యాండ్‌ బస్సు కోచ్‌ల తయారీ పరిశ్రమ నుంచి ఉత్తర భారత్‌కు పెద్ద సంఖ్యలో బస్సులు తరలివెళ్లాయి. హిమాచల్‌ రోడ్‌ ట్రాన్స్‌పోర్టు కార్పొరేషన్‌ కోసం స్థానికంగా తయారు చేసిన 32 బస్సులను గూడ్సు రైల్లో శనివారం సాయంత్రం పంపించారు. దొడ్డబళ్లాపుర నుంచి మొదటి విడతలో 32 బస్సులను పంపించామని సంస్థ ప్రతినిధులు తెలిపారు. బెంగళూరు నుంచి చండీగఢ్‌ వరకు వీటిని రైల్లో చేరవేస్తారు. ఈ రెండు నగరాల మధ్యదూరం 2,825 కిలోమీటర్లు ఉండగా.. ఐదు రోజుల తర్వాత అవి గమ్యస్థానానికి చేరతాయి. సురక్షిత కోసం యలహంక, విజయవాడ, భోపాల్‌ మార్గంలో ఈ గూడ్సు రైలు ప్రయాణించనుంది. విద్యుత్తు మార్గం ఉన్న ప్రాంతాల్లో తీగలకు బస్సులు తగలకుండా గూడ్సు రైలు ర్యాక్‌ను, బస్సులకు టైర్లలో గాలి తొలగించి ఎత్తును తగ్గించామని రైల్వే అధికారులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని