logo

అదుపుతప్పితే అంతే..

వర్షంతో కొట్టుకుపోయిన రహదారులు.. అడుగడుగునా భారీ గుంతలు.. ప్రమాదకరంగా బిలమార్గాలు నగరవాసిని ఇబ్బంది పెడుతున్నాయి. ఈ ప్రమాదకర ప్రాంతాల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ కార్యకర్తలు ఆదివారం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.

Published : 23 May 2022 01:38 IST

పూజ చేసిన గుంత వద్ద కార్యకర్తల వినూత్న నిరసన

బెంగళూరు (సదాశివనగర) : వర్షంతో కొట్టుకుపోయిన రహదారులు.. అడుగడుగునా భారీ గుంతలు.. ప్రమాదకరంగా బిలమార్గాలు నగరవాసిని ఇబ్బంది పెడుతున్నాయి. ఈ ప్రమాదకర ప్రాంతాల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ కార్యకర్తలు ఆదివారం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. మహదేవపుర, కేఆర్‌పుర విభాగాల్లో ఆరు చోట్ల ఈ గుంతలు ప్రమాదాలను ఆహ్వానిస్తున్నాయని పార్టీ నాయకుడు అశోక్‌ మృత్యుంజయ ఆందోళన వ్యక్తం చేశారు. బృహత్‌ బెంగళూరు మహానగర పాలికె ఇంజినీర్లు, అధికారులు ఈ గుంతలకు మరమ్మతులు చేయించేందుకు శ్రద్ధ చూపించడం లేదని ఆరోపించారు. ప్రమాదకరంగా ఉన్న గుంతల వద్ద పూజలు చేశారు. ఆందోళనలో పార్టీ నేతలు కల్లప్ప అక్కోజి, మనోహర్‌ రెడ్డి, జగదీశ్‌ శెట్టి, గుంజన్‌, వీణ, సతీశ్‌, కాళయ్య తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు