logo

కౌల్‌బజార్‌ మార్కెట్‌ను పరిశీలించిన కమిషనర్‌

బళ్లారి నగర పాలికె కమిషనర్‌ ప్రీతిగెహ్లాట్‌, స్థాయి సమితి అధ్యక్షురాలు, 26వ వార్డు కార్పొరేటర్‌ డి.సుకుం పాలికె అధికారులు, సిబ్బంది ఆదివారం కౌల్‌బజార్‌ మార్కెట్‌లో జరుగుతున్న రహదారి పనులు, దుస్థితికి చేరుకున్న రహదారులు, భూగర్భ మురుగుకాలువలు,

Published : 23 May 2022 01:38 IST

కౌల్‌బజార్‌ మార్కెట్‌లో పర్యటిస్తున్న కమిషనర్‌

ప్రీతి గెహ్లాట్‌, స్థాయి సమితి అధ్యక్షురాలు డి.సుకుం, తదితరులు

బళ్లారి, న్యూస్‌టుడే: బళ్లారి నగర పాలికె కమిషనర్‌ ప్రీతిగెహ్లాట్‌, స్థాయి సమితి అధ్యక్షురాలు, 26వ వార్డు కార్పొరేటర్‌ డి.సుకుం పాలికె అధికారులు, సిబ్బంది ఆదివారం కౌల్‌బజార్‌ మార్కెట్‌లో జరుగుతున్న రహదారి పనులు, దుస్థితికి చేరుకున్న రహదారులు, భూగర్భ మురుగుకాలువలు, తదితర సమస్యలను నేరుగా పరిశీలించారు. ఒకే ప్రాంతంలో మటన్‌, చికెన్‌, కూరగాయల మార్కెట్లు ఉండటంతో చుట్టుపక్కల ప్రాంతాలు అపరిశుభ్రంగా మారిపోయాయి. వాటిని చూసిన కమిషనర్‌ మార్కెట్‌ను పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బందికి సూచించారు. స్థానిక ప్రజలు, వ్యాపారులు పాలికెతో సహకరించాలని కోరారు. మార్కెట్‌లో బురద మధ్యలోనే కమిషనర్‌ నడుచుకుంటూ స్థానిక వ్యాపారులు, ప్రజల నుంచి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని