logo

హంపీలో యోగాభ్యాసం దక్కడం అదృష్టమే

హంపీలో యోగాభ్యాసం చేసే అదృష్టం అందరికీ కలిసిరాదని పర్యాటక శాఖ మంత్రి ఆనంద్‌సింగ్‌ పేర్కొన్నారు. కేంద్ర ఆయుష్‌ వైద్యశాఖ, పతంజలి యోగా సమితులు సంయుక్తంగా హంపీలోని ఉగ్రనరసింహ, బడవిలింగ ఆలయాల వద్ద ఆదివారం ఉదయం ఏర్పాటు

Published : 23 May 2022 01:38 IST

వచనానంద స్వామి, భవర్‌లాల్‌ ఆర్యతో కలిసి

యోగాభ్యాసం చేస్తున్న మంత్రి ఆనంద్‌సింగ్‌

హొసపేటె, న్యూస్‌టుడే: హంపీలో యోగాభ్యాసం చేసే అదృష్టం అందరికీ కలిసిరాదని పర్యాటక శాఖ మంత్రి ఆనంద్‌సింగ్‌ పేర్కొన్నారు. కేంద్ర ఆయుష్‌ వైద్యశాఖ, పతంజలి యోగా సమితులు సంయుక్తంగా హంపీలోని ఉగ్రనరసింహ, బడవిలింగ ఆలయాల వద్ద ఆదివారం ఉదయం ఏర్పాటు చేసిన యోగాభ్యాసం శిబిరంలో ఆయన మాట్లాడారు. జూన్‌ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం నేపథ్యంలో రెండు వారాల నుంచి హంపీలో యోగా శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నాం. మంచి స్పందన లభించిందని హర్షం వ్యక్తం చేశారు. యోగా దినోత్సవం వరకు ప్రతి ఆదివారం శిబిరాలు జరుగుతాయన్నారు. ఇక్కడ యోగాభ్యాసం చేసి, దానిని ఇంట్లో కొనసాగిస్తే చక్కని ఆరోగ్యం మన సొంతమని స్పష్టం చేశారు. శిబిరంలో హరిహర పీఠం వచనానంద స్వామీజీ, పతంజలి యోగా సమితి రాష్ట్ర బాధ్యుడు భవర్‌లాల్‌ ఆర్య, తదితరులు పాల్గొన్నారు.

హంపీ ఉగ్రనరసింహ ఆలయం వద్ద ఏర్పాటు

చేసిన యోగా శిబిరంలో పాల్గొన్న శిబిరార్థులు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని