logo

కపట నాటక పాత్రధారి

తమ వివాహేతర సంబంధానికి బిడ్డ అడ్డుగా ఉందనే ఉద్దేశంతో పరాయి బిడ్డగా నమ్మించే యత్నంలో ఓ వ్యక్తి అడ్డంగా దొరికిపోయిన సంఘటన మైసూరు నగరం లష్కర్‌ ప్రాంతంలో చోటుచేసుకుంది. అలా నమ్మించేందుకు ప్రయత్నించిన వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు.

Published : 24 May 2022 02:28 IST

ప్రియురాలి బిడ్డనే పరాయిబిడ్డ అని పోలీసు స్టేషన్‌ చేరిన రఘు (పాతచిత్రం)

మైసూరు, న్యూస్‌టుడే : తమ వివాహేతర సంబంధానికి బిడ్డ అడ్డుగా ఉందనే ఉద్దేశంతో పరాయి బిడ్డగా నమ్మించే యత్నంలో ఓ వ్యక్తి అడ్డంగా దొరికిపోయిన సంఘటన మైసూరు నగరం లష్కర్‌ ప్రాంతంలో చోటుచేసుకుంది. అలా నమ్మించేందుకు ప్రయత్నించిన వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకెళ్తే.. జిల్లాలోని హెచ్‌.డి.కోటె తాలూకాకు చెందిన రఘు అనే వ్యక్తి రెండు వారాల కిందట రాయచూరు బస్టాండ్‌లో బస్సుకోసం వేచి ఉన్న సమయంలో ఓ మహిళ చిన్నారిని తీసుకొచ్చి మరుగుదొడ్డికి వెళ్లాలంటూ ఇచ్చి వెళ్లిందట. రెండు గంటలైనా ఆమె రాకపోయేసరికి మైసూరుకు రావాల్సి ఉన్నందున బయలుదేరి మైసూరు చేరుకున్నానని ఆ వ్యక్తి వివరించాడు. వెంటనే లష్కర్‌ పోలీసు స్టేషన్‌లో సంఘటన వివరాలు తెలిపి బిడ్డను అప్పగించాడు. ఆ మగబిడ్డను స్వాధీనం చేసుకుని బాల వికాస కేంద్రానికి తరలించిన పోలీసులు.. కేసు దర్యాప్తును చేపట్టారు. రఘును మరింత లోతుగా విచారించేసరికి అతని ప్రేమ పురాణం బయటపడింది. అప్పటికే భర్త నుంచి దూరంగా ఉంటూ వచ్చిన ఓ మహిళతో రఘుకు పరిచయమైంది. ఆమెకు అప్పటికే ఓ మగబిడ్డ ఉండడంతో అడ్డుగా ఉన్నాడని భావించి వదిలించుకునే ప్రయత్నం చేశాడని దర్యాప్తులో వెల్లడైంది. అందులో భాగంగానే పై నాటకమంతా ఆడినట్లు గుర్తించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని