logo

తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు

తీర ప్రాంతాలు మినహా ఇతర ప్రదేశాల్లో సోమవారం దాదాపు పొడి వాతావరణం కొనసాగింది. సాగర తీర ప్రాంతాల్లో ఓమోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసినట్లు సమాచారం అందింది. వరుసగా కురుస్తున్న వర్షాలకు వివిధ జలాశయాలకు వరద ప్రవాహం కొనసాగుతోంది.

Published : 24 May 2022 02:28 IST

జలాశయాలకు కొనసాగుతున్న వరద

రామనగర జిల్లాలోని ఇగ్గలూరు బ్యారేజ్‌ నుంచి విడుదలవుతున్న నీరు

బెంగళూరు (ఎలక్ట్రానిక్‌ సిటీ), న్యూస్‌టుడే : తీర ప్రాంతాలు మినహా ఇతర ప్రదేశాల్లో సోమవారం దాదాపు పొడి వాతావరణం కొనసాగింది. సాగర తీర ప్రాంతాల్లో ఓమోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసినట్లు సమాచారం అందింది. వరుసగా కురుస్తున్న వర్షాలకు వివిధ జలాశయాలకు వరద ప్రవాహం కొనసాగుతోంది. తుంగభద్ర జలాశయానికి ఒకేరోజులో ఐదు టీఎంసీల నీరు చేరగా.. ఆలమట్టి జలాశయానికి రెండున్నర టీఎంసీల నీరు వచ్చింది. వివిధ జలాశయాలకు చేరుతున్న ఇన్‌ఫ్లోల విషయానికొస్తే... నారాయణపుర- 18,445 క్యూసెక్కులు, ఆలమట్టి- 42,973, కబిని 2,947, కేఆర్‌ఎస్‌- 12,488, హేమావతి- 3,332 క్యూసెక్కుల నీరు చేరుతోందని జలవనరులశాఖ అధికారులు వెల్లడించారు. ఇతర అనేక చిన్నతరహా బ్యారేజ్‌లు భర్తీ కావడంతో నీటి విడుదల కొనసాగుతోందని చెప్పారు.

మంగళూరులో సోమవారం అత్యధికంగా ఎనిమిది సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. మాణి, సిద్ధాపుర 6, విట్ల 5, పుత్తూరు 4, కద్ర 3, సుళ్య, భాగమండల, సంపాజె 2, ధర్మస్థల, ముల్కి, బెళ్తంగడి, పణంబూరు, శిరాళి, అంకోలా, తుమ్రి, ముర్నాడులో ఒక సెంటీమీటరు వర్షం కురిసింది. రాబోయే రెండు రోజుల్లో ఇదే పరిస్థితి కొనసాగనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని