logo

పదవులన్నీ వారి సొంతమా?

పార్టీ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ఆ నాయకులు మాత్రమే మంత్రులుగా ఉండాలా అని ముఖ్యమంత్రి రాజకీయ కార్యదర్శి, హొన్నళ్లి శాసనసభ్యుడు ఎం.పి.రేణుకాచార్య భాజపా నాయకత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. ఆయన సోమవారం జిల్లాలోని హొన్నాళిలో తనను కలుసుకున్న విలేకరులతో మాట్లాడారు.

Published : 24 May 2022 02:28 IST

హొన్నాళిలో ఎం.పి.రేణుకాచార్య

దావణగెరె, న్యూస్‌టుడే : పార్టీ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ఆ నాయకులు మాత్రమే మంత్రులుగా ఉండాలా అని ముఖ్యమంత్రి రాజకీయ కార్యదర్శి, హొన్నళ్లి శాసనసభ్యుడు ఎం.పి.రేణుకాచార్య భాజపా నాయకత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. ఆయన సోమవారం జిల్లాలోని హొన్నాళిలో తనను కలుసుకున్న విలేకరులతో మాట్లాడారు. మంత్రివర్గ విస్తరణలో కొత్తవారికి అవకాశమివ్వాలని సూచించానని వివరించారు. కొందరు మాత్రమే ఎప్పుడూ మంత్రులుగా చలామణి అయ్యేలా చూసుకుంటున్నారని ధ్వజమెత్తారు. తాను మూడుసార్లు శాసనసభ్యుడిగా ఎన్నికైన విషయాన్ని గుర్తించాలన్నారు. ఈ నేపథ్యంలోనే మంత్రిపదవి కావాలని అడుగుతున్నానని చెప్పారు. దావణగెరె జిల్లాకు మంత్రివర్గంలో అన్యాయమే జరిగిందన్నారు. ఈ జిల్లాకు చెందిన నాయకుల్లో ఏ ఒక్కరికీ మంత్రివర్గంలో అవకాశం కల్పించలేదని విమర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని