logo

పర్యావరణ రక్షణకు యాత్ర

దావోస్‌ సదస్సులో పర్యావరణ వైపరీత్యాలు, కాలుష్యంపై నిర్వహించిన చర్చా గోష్ఠిలో ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై పాల్గొన్నారు. ఈశా సంస్థ వ్యవస్థాపకులు జగ్గీ వాసుదేవ్‌ నేతృత్వంలో నిర్వహించిన ఈ చర్చావేదికపై రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కాలుష్య నివారణ చర్యలు, బడ్జెట్‌లో ఈ విభాగానికి ప్రకటించిన నిధుల స్థాయిని ముఖ్యమంత్రి వివరించారు.

Published : 24 May 2022 02:28 IST

దావోస్‌లో ప్రఖ్యాత ఆధ్యాత్మికవేత్త జగ్గీ వాసుదేవ్‌తో సీఎం బొమ్మై, మంత్రులు మురుగేశ్‌ నిరాణి, అశ్వత్థనారాయణ

ఈనాడు, బెంగళూరు : దావోస్‌ సదస్సులో పర్యావరణ వైపరీత్యాలు, కాలుష్యంపై నిర్వహించిన చర్చా గోష్ఠిలో ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై పాల్గొన్నారు. ఈశా సంస్థ వ్యవస్థాపకులు జగ్గీ వాసుదేవ్‌ నేతృత్వంలో నిర్వహించిన ఈ చర్చావేదికపై రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కాలుష్య నివారణ చర్యలు, బడ్జెట్‌లో ఈ విభాగానికి ప్రకటించిన నిధుల స్థాయిని ముఖ్యమంత్రి వివరించారు. ఇదే సందర్భంగా మట్టి పరిరక్షణ నినాదంతో జగ్గీ వాసుదేవ్‌ 100 రోజుల పాటు 30 వేల కిలోమీటర్ల వరకు చేపట్టే ద్విచక్రవాహన యాత్రకు శ్రీకారం చుట్టారు. యూరప్‌, పశ్చిమ ఆసియా దేశాల నుంచి సాగే ఈ యాత్ర జులై 19న బెంగళూరుకు చేరుకుంటుంది. నగరంలోని ప్యాలెస్‌ మైదానంలో భారీ సమావేశాన్ని నిర్వహించి ప్రజా చైతన్యానికి ఊతమిస్తారు. ఈ యాత్రకు ముఖ్యమంత్రి బొమ్మై స్వాగతం పలుకనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని