logo

భళా.. మామిడిమేళా

కొప్పళలో ఉద్యానవన శాఖ ఏర్పాటు చేసిన మేళా మామిడి ప్రియులను నోరూరిస్తోంది. జిల్లాలోని రైతులు 100 రకాల మామిడిపండ్లను ప్రదర్శనకు ఉంచారు. కేసర్‌, ఆపూస్‌, దశహరి, బేనాసాన్‌, మల్లికా, సింధూరి, రసపురి, తోతాపురి, కల్మి, ఊరగాయ మామిడి పండ్లు ఆకట్టుకుంటున్నాయి.

Published : 24 May 2022 02:28 IST

మేళా ప్రారంభించి పండ్లను పరిశీలిస్తున్న మంత్రి హాలప్పా ఆచార్‌

గంగావతి,న్యూస్‌టుడే: కొప్పళలో ఉద్యానవన శాఖ ఏర్పాటు చేసిన మేళా మామిడి ప్రియులను నోరూరిస్తోంది. జిల్లాలోని రైతులు 100 రకాల మామిడిపండ్లను ప్రదర్శనకు ఉంచారు. కేసర్‌, ఆపూస్‌, దశహరి, బేనాసాన్‌, మల్లికా, సింధూరి, రసపురి, తోతాపురి, కల్మి, ఊరగాయ మామిడి పండ్లు ఆకట్టుకుంటున్నాయి. రాష్ట్ర గనుల శాఖ మంత్రి హాలప్పా ఆచార్‌ సోమవారం ఈ మేళాను ప్రారంభించి మాట్లాడుతూ పండ్ల రైతుల కోసం జిల్లాలో 10 ఎకరాల విస్తీర్ణంలో శుద్ధీకరణ కేంద్రం ప్రారంభించినట్లు చెప్పారు. సేంద్రియ పద్ధతుల్లో పండించిన మామిడి రకాలను రైతుల నుంచి నేరుగా వినియోగదారులకు అందించే ఉద్దేశంతో ప్రతి ఏడాది మేళా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇటీవల కురిసిన వానలకు దెబ్బతిన్న పంటలను గుర్తించి పరిహారం పంపిణీ చేయాలన్నారు. ఈ సందర్భంగా డిజిటల్‌ మేళాను కొప్పళ శాసనసభ్యుడు రాఘవేంద్ర హిట్నాళ ప్రారంభించారు. కొప్పళ ఒన్‌ యాప్‌తో 200 గ్రాముల నుంచి ఎన్ని కిలోలైనా ఇంటికి తెప్పించుకోవచ్చన్నారు. కార్యక్రమంలో జిల్లా పాలనాధికారి వికాస్‌ కిశోర్‌, జడ్పీ సీఈవో ఫౌజియాతరున్నమ్‌, ఉద్యానవన శాఖ ఉప సంచాలకులు కృష్ణ ఉక్కుంద పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని