logo

నందిహళ్లిలో శాంతి సభ

తాలూకాలోని నందిహళ్లిలో శనివారం రాత్రి దళితులపై దాడి జరిగిన విషయమై జిల్లా పాలనాధికారి నేతృత్వంలో వివిధ శాఖల అధికారులు సోమవారం గ్రామాన్ని సందర్శించారు. దాడికి గురైన కుటుంబాలను పరామర్శించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని బాధితులకు ధైర్యం చెప్పారు.

Published : 24 May 2022 02:28 IST

దాడికి గురైన కుటుంబాలను పరామర్శిస్తున్న అధికారులు

కారటగి, న్యూస్‌టుడే: తాలూకాలోని నందిహళ్లిలో శనివారం రాత్రి దళితులపై దాడి జరిగిన విషయమై జిల్లా పాలనాధికారి నేతృత్వంలో వివిధ శాఖల అధికారులు సోమవారం గ్రామాన్ని సందర్శించారు. దాడికి గురైన కుటుంబాలను పరామర్శించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని బాధితులకు ధైర్యం చెప్పారు. అనంతరం జరిగిన శాంతి సభలో జిల్లా పాలనాధికారి వికాస్‌ కిశోర్‌ మాట్లాడుతూ చిన్న ఘటన గ్రామంలో శాంతికి భంగం కలిగించడం విచారకరం. దాడి జరిగిన విషయమై పోలీసు శాఖ వద్ద పూర్తి సమాచారం ఉంది. బాధ్యులపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం. శాంతిని కాపాడేందుకు గ్రామంలో ఇరువర్గాలతో మరోసారి సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. బాధితులకు నిత్యావసర సరకులు పంపిణీ చేయాలని అధికారులకు సూచించారు. దళిత యువతకు రుణ సదుపాయం కల్పిస్తామన్నారు. ఎస్పీ అరుణాంశగిరి, జడ్పీ సీఈవో ఫౌజియా తరుణ్ణమ్‌, డీవైఎస్పీ రుద్రేశ్‌ ఉజ్జనికొప్ప, తహసీల్దార్‌ రవి అంగడి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని