logo

త్వరలో.. గాడిద పాల కేంద్రం!

అన్నీ అనుకున్నట్లుగా జరిగితే మరికొన్ని నెలల్లో రేవునగరి మంగళూరు సమీప గ్రామం రాష్ట్రంలోనే తొలి గాడిద పాల కేంద్రానికి వేదిక కానుంది. ఆరోగ్య సంరక్షణలో గాడిద పాలకు లభిస్తున్న విపరీతమైన డిమాండు నేపథ్యంలో శ్రీనివాసగౌడ అనే సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ దీన్ని బంట్వాళ తాలూకా మంచి గ్రామంలో నెలకొల్పుతున్నారు.

Published : 25 May 2022 05:07 IST

మంగళూరు శివార్లలో ఏర్పాట్లు

మంగళూరు, న్యూస్‌టుడే : అన్నీ అనుకున్నట్లుగా జరిగితే మరికొన్ని నెలల్లో రేవునగరి మంగళూరు సమీప గ్రామం రాష్ట్రంలోనే తొలి గాడిద పాల కేంద్రానికి వేదిక కానుంది. ఆరోగ్య సంరక్షణలో గాడిద పాలకు లభిస్తున్న విపరీతమైన డిమాండు నేపథ్యంలో శ్రీనివాసగౌడ అనే సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ దీన్ని బంట్వాళ తాలూకా మంచి గ్రామంలో నెలకొల్పుతున్నారు. వచ్చే నెల నుంచే అందుబాటులోకి తీసుకురావాలనేది ఆయన ఆలోచన. ఈ అవసరాలకే గుజరాత్‌ నుంచి మంచి శరీర పుష్టి కల్గిన 30 గాడిదలను తీసుకొచ్చారు.

రెండెకరాల విస్తీర్ణంలో తొలిదశలో దీన్ని ఏర్పాటు చేయనున్నారు. మంగళూరు ప్రాంతంతో పాటు దక్షిణ కన్నడ జిల్లాల్లో గాడిదల పెంపకానికి అవసరమైన ప్రోత్సాహాన్ని అందించనున్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో లీటరు గాడిద పాలు రూ.10 వేల వరకు ధర లభిస్తోంది. విదేశాల్లో ఈ ధర మరింత అధికంగా ఉంటోందని నిర్వాహకులు తెలిపారు. మంగళూరు డెయిరీలో రోజుకు 10 లీటర్ల పాలను సంస్కరించి 100 మి.లీ, 200 మి.లీ. సీసాల్లో వినియోగదారులకు అందించాలనేది నిర్వాహకుల ఆలోచన. గాడిదలను పోషించే రైతులకు ప్రతి నెలా ఒక్కో గాడిద నుంచి రూ. 30 వేలకు పైగా ఆదాయాన్ని గడించవచ్చని శ్రీనివాసగౌడ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని