logo

పంచాయతీలలో అస్పృశ్యత నివారణకు చర్యలు

రాష్ట్రంలోని 6,020 గ్రామ పంచాయతీలలో అస్పృశ్యత నిర్మూలనా చర్యలు చేపట్టనున్నట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కోటా శ్రీనివాస పూజారి పేర్కొన్నారు. మంగళవారం కొప్పళలో ఆయన పలు పథకాల లబ్ధిదారులకు పరికరాలు, వాహనాలు పంపిణీ చేసి సాంఘిక సంక్షేమశాఖ పథకాల ప్రగతిని సమీక్షించారు

Published : 25 May 2022 05:07 IST

ట్యాబ్‌లు పంపిణీ చేస్తున్న మంత్రి కోటా శ్రీనివాస పూజారి

గంగావతి, న్యూస్‌టుడే: రాష్ట్రంలోని 6,020 గ్రామ పంచాయతీలలో అస్పృశ్యత నిర్మూలనా చర్యలు చేపట్టనున్నట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కోటా శ్రీనివాస పూజారి పేర్కొన్నారు. మంగళవారం కొప్పళలో ఆయన పలు పథకాల లబ్ధిదారులకు పరికరాలు, వాహనాలు పంపిణీ చేసి సాంఘిక సంక్షేమశాఖ పథకాల ప్రగతిని సమీక్షించారు. ప్రభుత్వం కఠిన చట్టాలు ప్రవేశ పెట్టినా జిల్లాలో ఇలాంటి సామాజిక రుగ్మతలు ఇంకా ఉండడంపై విచారం వ్యక్తం చేశారు. వీటిని రూపుమాపేందుకు స్వామీజీలు, ప్రజాప్రతినిధులు సహకరించాలని కోరారు. ప్రతి పంచాయతీలో అస్పృశ్యత నివారణ చైతన్య కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. కొప్పళ జిల్లాలో 100 జంటలకు సామూహిక వివాహాలు నెరవేర్చనున్నట్లు చెప్పారు. విద్యార్థినుల్లో ఆత్మస్థైర్యం నింపేందుకు ప్రారంభించిన ఓబవ్వ ఆత్మరక్షణ కళను ఆరో తరగతికి విస్తరిస్తున్నట్లు తెలిపారు. సాంఘిక సంక్షేమ పథకాల్లో మధ్యవర్తుల బెడదను తప్పించాలన్నారు. గనుల, మహిళా, శిశ ుసంక్షేమశాఖ మంత్రి హాలప్పా ఆచార్‌ మాట్లాడుతూ జిల్లాలో 27 మొరార్జీ వసతి పాఠశాలలు ఉండి 11వేల మంది దరఖాస్తులు పెట్టుకుంటున్నారన్నారు. 1,440 మందికి మాత్రమే ప్రవేశం లభిస్తోందన్నారు. మిగిలిన వారు ఇతర జిల్లాలకు వెళ్లాల్సి వస్తోందంటూ వసతి పాఠశాలల సంఖ్య పెంచాలని కోరారు. కార్యక్రమంలో శాసనసభ్యులు అమరేగౌడ, రాఘవేంద్ర హిట్నాళ, ధడేసూగూరు బసవరాజ్‌, జిల్లా పాలనాధికారి వికాస్‌కిశోర్‌ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని