logo

కానరాని అదుపు.. కూడలిలో కుదుపు

సింధనూరు ప్రధాన కూడలి గాంధీ సర్కిల్‌లో రోజు రోజుకూ ప్రమాదాల సంఖ్య పెరిగిపోతోంది. కారణం..సిగ్నల్‌ స్తంభం విరిగిపోవడమే. మూడు రహదారుల కూడలిగా ఉండే ఈ సర్కిల్‌లో ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ రెండేళ్ల క్రితం అమర్చారు. అప్పటి నుంచి ట్రాఫిక్‌ కాస్త అదుపులో ఉంటుంది.

Published : 25 May 2022 05:07 IST

దూసుకొచ్చిన కారు ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టిన దృశ్యం

సింధనూరు, న్యూస్‌టుడే: సింధనూరు ప్రధాన కూడలి గాంధీ సర్కిల్‌లో రోజు రోజుకూ ప్రమాదాల సంఖ్య పెరిగిపోతోంది. కారణం..సిగ్నల్‌ స్తంభం విరిగిపోవడమే. మూడు రహదారుల కూడలిగా ఉండే ఈ సర్కిల్‌లో ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ రెండేళ్ల క్రితం అమర్చారు. అప్పటి నుంచి ట్రాఫిక్‌ కాస్త అదుపులో ఉంటుంది. జతగా ఇద్దరు పోలీసు కానిస్టేబుళ్లు కూడా ఇక్కడ విధులు అందిస్తుంటారు. అంతలా కాపలా ఉన్నా.. ట్రాఫిక్‌ను అదుపు చేయడం కష్టమవుతుంటుంది. ఈ నెల 5న తెల్లవారుజామున ఓ ఇటుకల లారీ కూడలిలోని గంగావతి మార్గం వైపు ఉన్న సిగ్నల్‌ స్తంభాన్ని ఢీకొట్టి బోల్తా కొట్టగా స్తంభం విరిగి ముక్కలైంది. లారీపై స్థానిక నగరసభ ఎలాంటి కేసూ నమోదు చేయలేదు. లారీ యాజమాన్యంతో తిరిగి దానికి మరమ్మతులూ చేయించలేదు. నగరసభ కూడా పట్టించుకోలేదు. 20 రోజులైనా బాగుపడని ట్రాఫిక్‌ సిగ్నల్‌ కారణంగా కూడలిలో వాహనాలు ఇష్టారాజ్యంగా సంచరిస్తున్నాయి. పోలీసులు నిలుచున్నా..పట్టించుకోకుండా దూసుకుపోతున్నాయి. రోజూ ఏదో ఓ సమయంలో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. రెండు రోజుల క్రితం బైకును కారు ఢీ కొట్టగా..ఈ రోజు కారును టిప్పర్‌ వెనుక నుంచి కొట్టి ఛిద్రం చేసింది. ఫలితంగా ఇరువైపులా ఘర్షణలతో ట్రాఫిక్‌ మరింత స్తంభించిపోతోంది. అధికారులు పట్టించుకుని సిగ్నల్‌ స్తంభాన్ని మరమ్మతులు చేయించాలని ప్రజలు కోరుతున్నారు.

వెనుక నుంచి వచ్చి కారును ఢీకొన్న టిప్పర్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని