logo

చివరి రోజు.. నామినేషన్ల జోరు

విధానసభ నుంచి విధానపరిషత్తు ఏడు నియోజకవర్గాలకు జూన్‌ 3న ఎన్నికల కోసం మూడు రాజకీయ పార్టీల అభ్యర్థులు ఒకే రోజు నామినేషన్లను దాఖలు చేశారు. నామినేషన్లకు మంగళవారమే ఆఖరు. ఉదయం 11.45 నిమిషాలకు జేడీఎస్‌, ఒంటి గంటకు కాంగ్రెస్‌,

Published : 25 May 2022 05:07 IST

సిద్ధు, శివకుమార్‌లతో కలిసి నామపత్రాన్ని రిటర్నింగ్‌

అధికారిణి విశాలక్ష్మికి అందిస్తున్న నాగరాజ యాదవ్‌

బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్‌టుడే : విధానసభ నుంచి విధానపరిషత్తు ఏడు నియోజకవర్గాలకు జూన్‌ 3న ఎన్నికల కోసం మూడు రాజకీయ పార్టీల అభ్యర్థులు ఒకే రోజు నామినేషన్లను దాఖలు చేశారు. నామినేషన్లకు మంగళవారమే ఆఖరు. ఉదయం 11.45 నిమిషాలకు జేడీఎస్‌, ఒంటి గంటకు కాంగ్రెస్‌, రెండున్నరకు భాజపా అభ్యర్థులు కదలివచ్చి విధానసౌధలో సంబంధిత రిటర్నింగ్‌ అధికారిణి విశాలాక్షికి నామినేషన్లను సమర్పించారు. కాంగ్రెస్‌ అభ్యర్థులు నాగరాజు యాదవ్‌, అబ్దుల్‌ జబ్బార్‌తో పాటు ప్రతిపక్ష నేత సిద్ధరామయ్య, పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌, ఎగువసభలో ప్రతిపక్ష నేత బీకే హరిప్రసాద్‌తో కలిసి వచ్చి నామినేషన్‌ పత్రాలు అందజేశారు. జేడీఎస్‌ అభ్యర్థి టి.ఎ.శరవణకు తోడుగా మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి, పార్టీ రాష్ట్రాధ్యక్షుడు సీఎం ఇబ్రహీం కదలివచ్చారు. భాజపా తరఫున చలవాది నారాయణస్వామి, హేమలతా నాయక్‌, కేశవప్రసాద్‌, లక్ష్మణ సవది నామినేషన్లు వేశారు. వారికి పార్టీ రాష్ట్రాధ్యక్షుడు నళీన్‌కుమార్‌కటీల్‌, మంత్రులు ఉమేష్‌కత్తి, శివరాం హెబ్బార్‌, మాజీ ఎమ్మెల్యే నిర్మల్‌కుమార్‌ సురానా తదితరులు తోడుగా ఉన్నారు. నేతల వెంట పార్టీ కార్యకర్తలు, అభ్యర్థుల అనుచరులు విచ్చేసినా వారిని విధానసౌధ లోపలకు అనుమతించలేదు. నామినేషన్లను బుధవారం పరిశీలిస్తారు. పోటీ లేకపోవడంతో ఏడుగురు అభ్యర్థులూ ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశాలున్నాయి.

శరవణకు బీఫారాన్ని అందిస్తున్న కుమారస్వామి, సి.ఎం.ఇబ్రహీం, బండెప్ప కాశంపూర్‌

నాగరాజయాదవ్‌, అబ్దుల్‌ జబ్బార్‌లను కరచాలనం చేసి అభినందిస్తున్న సిద్ధరామయ్య, డి.కె.శివకుమార్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని