logo

గౌరీ లంకేశ్‌ కేసు విచారణ షురూ

సీనియరు విలేకరి గౌరీ లంకేశ్‌ హత్య కేసు విచారణ బెంగళూరులోని ‘కోకా’ న్యాయస్థానంలో శనివారం ప్రారంభమైంది. ఈ కేసులో 17 మంది నిందితుల తరఫున 60 మందికి పైగా న్యాయవాదులు విచారణకు హాజరయ్యారు.

Published : 29 May 2022 03:27 IST

బెంగళూరు (సదాశివనగర), న్యూస్‌టుడే : సీనియరు విలేకరి గౌరీ లంకేశ్‌ హత్య కేసు విచారణ బెంగళూరులోని ‘కోకా’ న్యాయస్థానంలో శనివారం ప్రారంభమైంది. ఈ కేసులో 17 మంది నిందితుల తరఫున 60 మందికి పైగా న్యాయవాదులు విచారణకు హాజరయ్యారు. ఇకపై ప్రతి నెలా ఐదు రోజులు విచారణ కొనసాగిస్తామని సంబంధిత న్యాయమూర్తి సి.ఎం.జోషి ప్రకటించారు. పరప్పన అగ్రహార కారాగారంలో ఉన్న నిందితులను వీడియో కాన్ఫరెన్సు ద్వారా విచారణకు హాజరుపరిచారు. న్యాయవాదులు తమ కక్షిదారులతో మాట్లాడేందుకు ఫోన్‌ ద్వారా అవకాశం కల్పిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. తదుపరి విచారణ జులై 4 నుంచి 8వ తేదీ వరకు నిర్వహిస్తామని న్యాయమూర్తి ప్రకటించారు. కార్యాలయం నుంచి తన నివాసంలోకి వెళుతున్న గౌరీ లంకేశ్‌పై నిందితులు 2017 సెప్టెంబరు 5న తుపాకీతో కాల్పులు జరిపి పరారైన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని