logo

జంటనగరాల మేయరుగా ఈరేశ

తీవ్ర కుతూహలాన్ని రేకెత్తించిన హుబ్బళ్లి- ధార్వాడ మహానగర పాలికె మేయరు, ఉపమేయరు స్థానాలను భాజపా కైవసం చేసుకుంది. శనివారం ఈ రెండు స్థానాలకు ఎన్నికల్ని నిర్వహించారు. మేయరుగా భాజపాకు చెందిన ఈరేశ అంచటగేరి, ఉపమేయరుగా ఉమా ముకుంద ఎన్నికయ్యారు.

Published : 29 May 2022 03:27 IST

మేయరు ఈరేశ అంచటగేరి, ఉపమేయరు ఉమా ముకుంద

హుబ్బళ్లి, న్యూస్‌టుడే : తీవ్ర కుతూహలాన్ని రేకెత్తించిన హుబ్బళ్లి- ధార్వాడ మహానగర పాలికె మేయరు, ఉపమేయరు స్థానాలను భాజపా కైవసం చేసుకుంది. శనివారం ఈ రెండు స్థానాలకు ఎన్నికల్ని నిర్వహించారు. మేయరుగా భాజపాకు చెందిన ఈరేశ అంచటగేరి, ఉపమేయరుగా ఉమా ముకుంద ఎన్నికయ్యారు. భాజపా, కాంగ్రెస్‌, ఎంఐఎం నుంచి మేయరు స్థానానికి ఇద్దరు వంతున, ఉప మేయరు స్థానానికి ఒక్కొక్క అభ్యర్థి బరిలోకి దిగడం గమనార్హం. మేయరుగా ఈరేశ అంచటగేరి 50 ఓట్లను సాధించారు. కాంగ్రెస్‌ అభ్యర్థి మయూర మోరెకు 35 ఓట్లు లభించాయి. ఉపమేయరుగా ఎన్నికైన ఉమా ముకుందకు 51 ఓట్లు లభించగా కాంగ్రెస్‌ అభ్యర్థి దీపా నీరలగికి 35 ఓట్లు లభించాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని