logo

మఠాధిపతితో బొమ్మై చర్చలు

వాల్మీకి సామాజికవర్గానికి రిజర్వేషన్‌ శాతం పెంచాలని, మాజీ న్యాయమూర్తి నాగమోహన్‌దాస్‌ నివేదికలోని ప్రతిపాదనలను అమలు చేయాలని డిమాండు చేస్తూ బెంగళూరు స్వతంత్ర ఉద్యానవనంలో 108 రోజుల నుంచి ధర్నా చేస్తున్న వాల్మీకి మఠాధిపతి ప్రసన్నానంద పురి స్వామిని ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై శనివారం కలిసి చర్చించారు.

Published : 29 May 2022 03:27 IST

వాల్మీకి మఠాధిపతి ప్రసన్నానందపురి స్వామితో మాట్లాడుతున్న బొమ్మై

బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్‌టుడే : వాల్మీకి సామాజికవర్గానికి రిజర్వేషన్‌ శాతం పెంచాలని, మాజీ న్యాయమూర్తి నాగమోహన్‌దాస్‌ నివేదికలోని ప్రతిపాదనలను అమలు చేయాలని డిమాండు చేస్తూ బెంగళూరు స్వతంత్ర ఉద్యానవనంలో 108 రోజుల నుంచి ధర్నా చేస్తున్న వాల్మీకి మఠాధిపతి ప్రసన్నానంద పురి స్వామిని ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై శనివారం కలిసి చర్చించారు. సమాజ సంక్షేమం కోసమే మఠాధిపతి పోరాటం చేస్తున్నారని, ఆయన డిమాండ్లపై నాకు అవగాహన ఉందని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా వివరించారు. రిజర్వేషన్ల పరిధి 50 శాతానికి మించరాదనే సర్వోన్నత న్యాయస్థానం తీర్పును ప్రస్తావించారు. రిజర్వేషన్‌ పెంచాలనే డిమాండుపై పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటామని హామీనిచ్చారు. ఇప్పటికిప్పుడు ఎలాంటి హామీ ఇవ్వడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. నివేదికను పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అదే ప్రాంతంలో ధర్నా చేస్తున్న పీఎస్‌ఐ పరీక్ష రాసిన అభ్యర్థులను ఆయన కలిసి మాట్లాడారు. ఈ వ్యవహారంలో అక్రమాలపై దర్యాప్తు కొనసాగుతోందని, విచారణ పూర్తయ్యే వరకు ఓపిక పట్టాలని హితవు చెప్పారు.

స్వతంత్ర ఉద్యానవనానికి విచ్చేసిన ముఖ్యమంత్రిని మాజీ మంత్రి బి.టి.లలితా నాయక్‌, రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా అధ్యక్షుడు వెంకటస్వామి, ఇతర ప్రతినిధులు కలుసుకున్నారు. ఎస్సై నియామక ప్రక్రియలో జరిగిన అక్రమాలపై దర్యాప్తును వేగవంతంగా పూర్తి చేసి, అర్హులకు ఉద్యోగాలు లభించేలా చూడాలని కోరుతూ వినతిపత్రాన్ని అందజేశారు.

ఎస్సై ఉద్యోగాల నియామక ప్రక్రియను రద్దు చేయకుండా కొనసాగించాలని డిమాండు చేస్తూ బెంగళూరులో ఆందోళనకు దిగిన అభ్యర్థులు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని