logo

మోదీ కోసం.. మూన్నాళ్ల ముచ్చట!

ఉద్యాననగరిలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటించే మార్గాలను అద్దంలా మెరిపించేందుకు బృహత్‌ బెంగళూరు మహానగర పాలికె యంత్రాంగం రూ.23 కోట్లు ఖర్చు చేసిన తీరు ఇప్పటికే విమర్శలకు గురికాగా.. ఆ పనులన్నీ బూడిదలో పోసిన పన్నీరు చందంగా మారాయి.

Published : 24 Jun 2022 01:56 IST

మరమ్మతులు చేసేందుకు సిద్ధమైన కార్మికులు

బెంగళూరు (శివాజీనగర), న్యూస్‌టుడే : ఉద్యాననగరిలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటించే మార్గాలను అద్దంలా మెరిపించేందుకు బృహత్‌ బెంగళూరు మహానగర పాలికె యంత్రాంగం రూ.23 కోట్లు ఖర్చు చేసిన తీరు ఇప్పటికే విమర్శలకు గురికాగా.. ఆ పనులన్నీ బూడిదలో పోసిన పన్నీరు చందంగా మారాయి. పలు చోట్ల ఈ ఖర్చు మూన్నాళ్ల ముచ్చటగా మిగిలింది.  కొన్ని రహదారుల అసలు రూపం మూన్నాళ్లలోనే బయటపడింది. నాసిరకం పనులు వెక్కిరిస్తున్నాయి. వేగంగా పనుల కోసం ఎక్కువ నగదు ఖర్చు చేశామని చెబుతూ గుత్తేదారులు పాలికె ఖజానాకు గండి కొట్టారు. బెంగళూరు విశ్వ విద్యాలయం చుట్టుపక్కల కొత్తగా వేసిన రహదారిపైన తారు లేచి పోయింది. కొన్ని చోట్ల మరమ్మతుల నిమిత్తం రహదారిపై తవ్వకాలు మొదలు పెట్టారు. వాస్తవ పరిస్థితులకు ఇక్కడి చిత్రం అద్దం పడుతోంది. నెటిజెన్లు ఇలాంటి చిత్రాలపై వేగంగా స్పందిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని