logo

విద్యా సంస్థలపై ఐటీ దాడులు

ఆదాయానికి తగిన రీతిలో పన్ను చెల్లించలేదన్న అనుమానంతో బెంగళూరు నగరంలోని కొన్ని విద్యా సంస్థలపై ఆదాయ పన్ను శాఖ అధికారులు గురువారం దాడులు నిర్వహించారు.

Published : 24 Jun 2022 01:56 IST

బెంగళూరులోని ఓ విద్యాలయంలో ఐటీ అధికారుల వాహనాలు

బెంగళూరు (మల్లేశ్వరం), న్యూస్‌టుడే : ఆదాయానికి తగిన రీతిలో పన్ను చెల్లించలేదన్న అనుమానంతో బెంగళూరు నగరంలోని కొన్ని విద్యా సంస్థలపై ఆదాయ పన్ను శాఖ అధికారులు గురువారం దాడులు నిర్వహించారు. బాగలూరు పరిధిలోని దివ్యశ్రీ గ్రూపు, రేవా యూనివర్సిటీ, హుణసెమారనహళ్లి పరిధిలోని కృష్ణదేవరాయ ఇన్‌స్టిట్యూట్లకు చెందిన కార్యాలయాలు, సంస్థల ప్రతినిధులకు చెందిన నివాసాలపై దాడి చేసి సోదాలు నిర్వహించారు. కర్ణాటక-గోవా విభాగానికి చెందిన 250 మంది అధికారులు, సిబ్బంది 70 కార్లలో వచ్చి 45 చోట్ల దాడులు చేశారు. విదేశీ విద్యార్థుల నుంచి ఎక్కువ రుసుములు తీసుకుని, దాన్ని లెక్కల్లో చూపలేదన్న ఆరోపణలు రావడంతో దాడులు నిర్వహించారని సమాచారం. ఈ సంస్థలకు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న శాఖలపైనా అధికారులు దాడి చేశారని సమాచారం. పలు దస్త్రాలను అధికారులు జప్తు చేసుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలను ఐటీ శాఖ అధికారికంగా ఇంకా వెల్లడించలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని