logo

వర్సిటీ ప్రాంగణంలో భల్లూకం ప్రత్యక్షం

హంపీ కన్నడ వర్సిటీ ఆవరణలో గురువారం భల్లూకం ప్రత్యక్షమైంది. హెలిప్యాడ్‌ వద్ద ఉదయం భల్లూకం సంచరిస్తుండగా దూరంనుంచి కొందరు విద్యార్థులు నాజూకు చరవాణిలో దృశ్యాలను బంధించారు. మొన్ననే వర్సిటీ ఆవరణలో ఓ చిరుత ప్రత్యక్షమై విద్యార్థుల్లో ఆందోళన కలిగించడం తెలిసిందే.

Published : 24 Jun 2022 01:56 IST

హొసపేటె, న్యూస్‌టుడే: హంపీ కన్నడ వర్సిటీ ఆవరణలో గురువారం భల్లూకం ప్రత్యక్షమైంది. హెలిప్యాడ్‌ వద్ద ఉదయం భల్లూకం సంచరిస్తుండగా దూరంనుంచి కొందరు విద్యార్థులు నాజూకు చరవాణిలో దృశ్యాలను బంధించారు. మొన్ననే వర్సిటీ ఆవరణలో ఓ చిరుత ప్రత్యక్షమై విద్యార్థుల్లో ఆందోళన కలిగించడం తెలిసిందే. ఇప్పుడు తాజాగా భల్లూకం కనిపించడంతో విద్యార్థులు భయాందోళన చెందుతున్నారు. పాపినాయకన హళ్లి, బైలువద్దిగెరె, గాదిగనూరు ప్రాంతాల నుంచి వర్సిటీకి వచ్చే విద్యార్థులు ‘బి’ గేట్‌ గుండా హెలిప్యాడ్‌ మార్గం నుంచే వర్సిటీ చేరుకుంటారు. ఆ ప్రాంతంలో భల్లూకం కనిపించడంతో అటు నుంచి వచ్చే విద్యార్థులు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్సిటీ పక్కనే దరోజి భల్లూకాల సంరక్షణ కేంద్రం ఉంది. అయినప్పటికీ ఎలుగులు వర్సిటీ ప్రాంగణంలో సంచరించడం చర్చనీయాంశంగా మారింది. భల్లూకాన్ని వెంటనే బంధించాలని వర్సిటీ వర్గాలు, విద్యార్థులు అటవీశాఖ అధికారులను కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని