logo

హంపీ ఎక్స్‌ప్రెస్‌కు అధునాతన బోగీలు

ఇన్నేళ్లు సాధారణ బోగీలతో నడుస్తున్న హంపీ ఎక్స్‌ప్రెస్‌ (హుబ్బళ్లి-మైసూరు) రైలు సంఖ్య: 16591-92కు గురువారం అధునాతన (లింక్‌ హాప్‌మన్‌ బుష్‌) బోగీలను ఏర్పాటు చేశారు.

Published : 25 Jun 2022 00:55 IST

హొసపేటె రైల్వేస్టేషన్‌లో ఆగిన హంపీ ఎక్స్‌ప్రెస్‌

హొసపేటె, న్యూస్‌టుడే: ఇన్నేళ్లు సాధారణ బోగీలతో నడుస్తున్న హంపీ ఎక్స్‌ప్రెస్‌ (హుబ్బళ్లి-మైసూరు) రైలు సంఖ్య: 16591-92కు గురువారం అధునాతన (లింక్‌ హాప్‌మన్‌ బుష్‌) బోగీలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం రిజర్వేషన్‌ విభాగానికి సంబంధించి నాలుగు అధునాతన బోగీలను అమర్చారు. రాబోయే రోజుల్లో అన్ని బోగీలను అధునాతనంగా మార్చుతున్నారు. సాధారణ బోగీలకన్నా ఈ లింక్‌ హాప్‌మన్‌ బుష్‌ బోగీలు విశాలంగా ఉంటాయి. ఆసనాల సామర్థ్యం కూడా ఎక్కువగా ఉంటుంది. రైలు ఎంత వేగంగా వెళ్లినా కుదుపులు, కదలికలు ఉండవు. అదనంగా సుమారు 150 ఆసనాలు అందుబాటులో ఉంటాయి. బోగీల భారం తక్కువగా ఉన్నందున రైలు కూడా వేగంగా వెళ్లటానికి సాధ్యపడుతుంది. శబ్దం కూడా ఎక్కువగా ఉండదని హొసపేటె రైల్వేస్టేషన్‌ మాస్టర్‌ యల్లప్ప పేర్కొన్నారు. బోగీల్లో శుభ్రతకు ప్రాధాన్యత ఇస్తారన్నారు. హంపీ ఎక్స్‌ప్రెస్‌కు అధునాతన బోగీలను అమర్చినందుకు విజయనగర రైల్వేపోరాట సమితి ప్రముఖులు యమునేశ్‌, మహేశ్‌ నైరుతి రైల్వే హుబ్బళ్లి విభాగం అధికారులకు కృతజ్ఞతలు తెలియజేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు