logo

అనువాద సరస్వతి.. గురులింగ

కేంద్ర సాహిత్య అకాడమీ ప్రతి సంవత్సరం ఆయా భాషా పుస్తక అనువాదకులకు పురస్కారంతో గౌరవిస్తున్న సంగతి తెలిసిందే. 2021 సంవత్సరపు కన్నడ భాషా అనువాదకుడు, సీనియర్‌ రచయిత గురులింగ కాపాసెకు అనువాద పురస్కారం ప్రకటించారు.

Published : 25 Jun 2022 00:55 IST

బెంగళూరు సాంస్కృతికం, న్యూస్‌టుడే : కేంద్ర సాహిత్య అకాడమీ ప్రతి సంవత్సరం ఆయా భాషా పుస్తక అనువాదకులకు పురస్కారంతో గౌరవిస్తున్న సంగతి తెలిసిందే. 2021 సంవత్సరపు కన్నడ భాషా అనువాదకుడు, సీనియర్‌ రచయిత గురులింగ కాపాసెకు అనువాద పురస్కారం ప్రకటించారు. కేంద్ర సాహిత్య అకాడమీ అధ్యక్షుడైన డాక్టర్‌ చంద్రశేఖర కంబార అధ్యక్షతన జరిగిన సభలో శుక్రవారం ఈవార్డుల ఎంపిక జరిగింది. శుక్రవారం అవార్డు గ్రహీతల పేర్లను, ఆయా భాషా పుస్తకాల పేర్లను ప్రకటించారు. మరాఠీ భాషలో విఖ్యాత రచయిత వి.స.ఖాండేకర్‌ రచించిన ‘ఏకా పనాచే గోష్ట్‌’ అనే మరాఠీ రచనను (ఖాండేకర్‌ ఆత్మకథ,) గురులింగ ‘ఒందు పుటద కథే’ పేరుతో కన్నడలోకి అనువదించారు. ఈ అనువాద పురస్కారం ఈ సంవత్సరం ఆగస్టులో దిల్లీలో ప్రదానం చేయనున్నట్లు అకాడమీ ప్రకటించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని