logo

అవన్నీ.. చీకటి రోజులు

ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో అమలు చేసిన అత్యయిక (ఎమర్జెన్సీ) పరిస్థితి ఓ చీకటి అధ్యాయమని మాజీ ముఖ్యమంత్రి డి.వి.సదానందగౌడ వ్యాఖ్యానించారు. రాజ్యాంగంలోని నిబంధనలు, చట్టాలను ఉల్లంఘించి 1975 జూన్‌ 25 నుంచి సుమారు 25 నెలలు అత్యయిక పరిస్థితిని అమలు

Published : 26 Jun 2022 04:46 IST

పాత సెంట్రల్‌ జైలు ఆవరణలో ఖైదీ విగ్రహాన్ని పరిశీలిస్తున్న సదానందగౌడ

బెంగళూరు (మల్లేశ్వరం), న్యూస్‌టుడే : ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో అమలు చేసిన అత్యయిక (ఎమర్జెన్సీ) పరిస్థితి ఓ చీకటి అధ్యాయమని మాజీ ముఖ్యమంత్రి డి.వి.సదానందగౌడ వ్యాఖ్యానించారు. రాజ్యాంగంలోని నిబంధనలు, చట్టాలను ఉల్లంఘించి 1975 జూన్‌ 25 నుంచి సుమారు 25 నెలలు అత్యయిక పరిస్థితిని అమలు చేశారని గుర్తు చేశారు. ఆ చీకటి రోజును పురస్కరించుకుని లోక్‌సభ సభ్యుడు పి.సి.మోహన్‌, బెంగళూరు కేంద్ర జిల్లా అధ్యక్షుడు జి.మంజునాథ్‌, ఇతర భాజపా నేతలతో కలిసి స్వాతంత్ర ఉద్యానవనం ఆవరణలోని పాత సెంట్రల్‌ జైలును సందర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ 1997లో అత్యయిక పరిస్థితులను తొలగించిన తర్వాత కారాగారం నుంచి విడుదలైన పలువురు నేతలు జనతా పార్టీ పేరిట సమాఖ్యగా ఏర్పడి ఎన్నికల్లో ఘనవిజయం సాధించారని గుర్తు చేశారు. ఆ రోజుల్లో ఆర్‌ఎస్‌ఎస్‌తో పాటు పలు సంఘాలు, సంస్థలపై ఇందిర నిషేధాన్ని విధించారని, డాక్టర్‌ శామప్రసాద ముఖర్జీ తన మంత్రి స్థానానికి రాజీనామా చేసి, కేంద్ర ప్రభుత్వంపై పోరుకు యువతను ప్రోత్సహించారని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని