logo

గుత్తేదారుకు రూ.3 లక్షల జరిమానా

ప్రధానమంత్రి నరేంద్రమోదీ నగర పర్యటన అనంతరం ఆయన సంచరించిన మార్గంలో పడిన గుంతలకు కారణమైన- నాసిరకం పనులు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొన్న గుత్తేదారు రమేష్‌కు రూ.3 లక్షల జరిమానా విధిస్తున్నట్లు బెంగళూరు

Published : 26 Jun 2022 04:46 IST

బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్‌టుడే : ప్రధానమంత్రి నరేంద్రమోదీ నగర పర్యటన అనంతరం ఆయన సంచరించిన మార్గంలో పడిన గుంతలకు కారణమైన- నాసిరకం పనులు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొన్న గుత్తేదారు రమేష్‌కు రూ.3 లక్షల జరిమానా విధిస్తున్నట్లు బెంగళూరు పాలికె అధికారులు ప్రకటించారు. తొమ్మిది కిలోమీటర్ల రహదారికి తారు వేసేందుకు ఆయనకు రూ.11.50 కోట్ల విలువైన పనులు అప్పగించారు. తారు వేసిన వారానికే రహదారులు దెబ్బతినడంపై నివేదిక అందజేయాలని ప్రధానమంత్రి కార్యాలయం ఆదేశించడంతో పాలికె చీఫ్‌ ఇంజినీరు ప్రహ్లాద్‌ ఆ గుత్తేదారుకు తాఖీదులు జారీ చేశారు. సంబంధిత రహదారి పనులపై అధికారుల నివేదిక ఆధారంగా జరిమానా విధించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని