logo

పర్యావరణానికి కాయకల్ప చికిత్స

అటవీ ఉత్పత్తులు పెంచేలా ప్రభుత్వం అన్ని విధాలా సహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై ప్రకటించారు. విధానసౌధ బాంక్వెట్‌ హాల్‌లో శనివారం ఏర్పాటు చేసిన అటవీ అభివృద్ధి మండలి

Published : 26 Jun 2022 04:46 IST

విశ్రాంతి అధికారులను సత్కరించిన ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై తదితరులు

బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్‌టుడే : అటవీ ఉత్పత్తులు పెంచేలా ప్రభుత్వం అన్ని విధాలా సహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై ప్రకటించారు. విధానసౌధ బాంక్వెట్‌ హాల్‌లో శనివారం ఏర్పాటు చేసిన అటవీ అభివృద్ధి మండలి సువర్ణ మహోత్సవాన్ని ఆయన ప్రారంభించి ప్రసంగించారు. ప్రపంచ వ్యాప్తంగా పర్యావరణ సంరక్షణ పెద్ద సవాల్‌గా మారిందన్నారు. పర్యావరణ రక్షణకు కాయకల్ప చికిత్స చేసి.. చక్కని వాతావరణాన్ని ఆవిష్కరించాలన్నారు. పరిసరాలను కాపాడకపోతే అనేక సమస్యలు ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. అటవీ ఉత్పత్తుల సాధనతో ఆర్థిక వృద్ధికి ప్రాధాన్యమిస్తున్నట్లు చెప్పారు. ఈ విభాగానికి దేశంలోనే తొలిసారిగా రాష్ట్ర బడ్జెట్‌లో ప్రత్యేక నిధులు కేటాయించినట్లు గుర్తు చేశారు. నీలగిరి వనాల పెంపకం వాతావరణంపై తీవ్రప్రభావం చూపుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరించారని గుర్తుచేశారు. వాటి పెంపకం వల్ల అటవీ ప్రదేశాలు నాశనం కావడంతో పాటు భూగర్భ నీటి మట్టం నాశనమవుతుందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు ఉమేశ్‌ కత్తి, ఆర్‌.అశోక్‌, ఎంపీ పీసీ మోహన్‌, మండలి అధ్యక్షురాలు తారా అనురాధ తదితరులు పాల్గొన్నారు. పర్యావరణ సంరక్షణకు శ్రమించిన మాజీ అధికారులను సత్కరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని