logo

జులైలో అంజనాద్రి అభివృద్ధి పనులు ప్రారంభం

అంజనాద్రి అభివృద్ధి పనులను జులైలో ప్రారంభించాలని ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై ఆదేశించారు. ఆయన బెంగళూరులో శనివారం కొప్పళ జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులతో సమావేశమై చర్చించారు. ఈలోగా భూసేకరణ ప్రక్రియను పూర్తి చేయాలని సీఎం సూచించారు.

Published : 26 Jun 2022 04:46 IST

అధికారులతో సమీక్షించిన సీఎం బొమ్మై

అంజనాద్రి అభివృద్ధిపై బెంగళూరులో చర్చిస్తున్న ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై

గంగావతి, న్యూస్‌టుడే : అంజనాద్రి అభివృద్ధి పనులను జులైలో ప్రారంభించాలని ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై ఆదేశించారు. ఆయన బెంగళూరులో శనివారం కొప్పళ జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులతో సమావేశమై చర్చించారు. ఈలోగా భూసేకరణ ప్రక్రియను పూర్తి చేయాలని సీఎం సూచించారు. అంజనాద్రి సమగ్ర అభివృద్ధికి అవసరమైన భూమి కోసం రైతులను ఒప్పించి కె.ఐ.ఎ.డి.బి. ద్వారా కొనుగోలు చేయాలన్నారు. తొలిదశలో ఇక్కడికి  చేరుకునే రహదారులు, జాతీయ రహదారి నుంచి గంగావతికి వచ్చే రహదారిని విస్తరణ చేయాలని సూచించారు. ప్రజాపనుల శాఖ వెంటనే పనులు ప్రారంభించాలని ఆదేశించారు. కొండకింద వాహనాల పార్కింగ్‌ తదితర మౌలిక సదుపాయాలను కల్పించాలన్నారు. సమగ్ర ప్రణాళికను రూపొందించి దీనికి వెంటనే ఆర్థిక, పరిపాలనా అనుమతులు పొందాలన్నారు. 430 మీటర్ల రోప్‌వే టెండర్ల ప్రక్రియను రెండు నెలల్లో పూర్తి చేయాలని పర్యాటక శాఖకు సూచించారు. రోప్‌వే వద్ద కట్టుదిట్టమైన సురక్షత చర్య చేపట్టాలన్నారు. జులై 15న తాను అంజనాద్రిని దర్శించి అభివృద్ధి పనులను పరిశీలిస్తానన తెలిపారు. సమావేశంలో మంత్రులు ఆనంగ్‌సింగ్‌, హాలప్పా చార్‌, లోక్‌సభ సభ్యుడు సంగణ్ణ కరడి, శాసనసభ్యులు పరణ్ణ మునవళ్లి, బసవరాజ్‌ ధడేసూగూరు, అమరేగౌడ, రాఘవేంద్ర హిట్నాళ, ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శి మంజునాథ్‌ ప్రసాద్‌, ఆర్థికశాఖ కార్యదర్శి ఏక్‌రూప్‌ కౌర్‌, పర్యాటక శాఖ కార్యదర్శి ప్రసాద్‌ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని