logo

లోక్‌ అదాలత్‌లో 4,970 కేసుల పరిష్కారం

జిల్లా న్యాయసేవా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం స్థానిక జిల్లా న్యాయస్థానం ఆవరణంలో నిర్వహించిన బృహత్‌ మోగా లోక్‌ అదాలత్‌కు విశేష స్పందన లభించింది. కేసులను రాజీమార్గం ద్వారా పరిష్కరించారు. అదాలత్‌కు మొత్తం 10,546 కేసులు

Published : 26 Jun 2022 04:46 IST

రాజీమార్గం ద్వారా కేసులను పరిష్కరిస్తున్న న్యాయమూర్తులు

బళ్లారి, న్యూస్‌టుడే : జిల్లా న్యాయసేవా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం స్థానిక జిల్లా న్యాయస్థానం ఆవరణంలో నిర్వహించిన బృహత్‌ మోగా లోక్‌ అదాలత్‌కు విశేష స్పందన లభించింది. కేసులను రాజీమార్గం ద్వారా పరిష్కరించారు. అదాలత్‌కు మొత్తం 10,546 కేసులు రిజిస్ట్రార్‌ చేయించుకోగా, 4,970 కేసులు రాజీమార్గం ద్వారా పరిష్కరించారు. మొత్తం రూ.44,44,96,317లు పరిహారం వసూలు చేసిననట్లు జిల్లా న్యాయసేవా ప్రాధికార సంస్థ కార్యదర్శి, న్యాయమూర్తి సతీశ్‌ జె.బాలి తెలిపారు. రాజీ మార్గం ద్వారా చెక్కులు, బ్యాంకు, మోటారు వాహనాలు ప్రమాద పరిహారం, సివిల్‌ కేసులు, ఆస్తి వివాదాలు తదితర కేసులు రాజీ మార్గం ద్వారా పరిష్కరించినట్లు తెలిపారు. న్యాయమూర్తులు, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని