logo

చీకటి రోజును ఎవరూ మరవరు

స్థానిక వాల్మీకి కూడలిలోని భాజపా కార్యాలయంలో శనివారం అత్యయిక పరిస్థితి విధించిన దినం (చీకటి రోజు) నిర్వహించారు. కార్యక్రమానికి పార్టీ జిల్లా అధ్యక్షుడు మురహరగౌడ, మంత్రి బి.శ్రీరాములు, శాసనసభ్యుడు గాలి సోమశేఖర్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఏచరెడ్డి సతీశ్‌, లోక్‌సభ సభ్యుడు వై.దేవేంద్రప్ప, మండలి అధ్యక్షుడు

Published : 26 Jun 2022 04:46 IST

కారటగి : అత్యవసర పరిస్థితిని అనుభవించిన వారిని సత్కరించిన భాజపా నాయకులు

బళ్లారి, న్యూస్‌టుడే : స్థానిక వాల్మీకి కూడలిలోని భాజపా కార్యాలయంలో శనివారం అత్యయిక పరిస్థితి విధించిన దినం (చీకటి రోజు) నిర్వహించారు. కార్యక్రమానికి పార్టీ జిల్లా అధ్యక్షుడు మురహరగౌడ, మంత్రి బి.శ్రీరాములు, శాసనసభ్యుడు గాలి సోమశేఖర్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఏచరెడ్డి సతీశ్‌, లోక్‌సభ సభ్యుడు వై.దేవేంద్రప్ప, మండలి అధ్యక్షుడు హనుమంతప్ప, బుడా అధ్యక్షుడు పి.పాలన్న పాల్గొని భరతమాత చిత్రపటానికి పూలమాలలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అత్యయిక పరిస్థితుల్లో దేశంలో శాంతిభద్రతల కోసం శ్రమించిన గణేశ్‌, సుబ్బరావ్‌, వీరస్వామి, బసవరాజ్‌ తదితరులను సన్మానం చేసి అభినందించారు. కార్యక్రమానికి పలువురు హజరయ్యారు.
హొసపేటె : తమ స్వార్థం కోసం కాంగ్రెస్‌ పాలకులు 45 ఏళ్ల కిందట అమలు చేసిన అత్యయిక రోజులను భారతీయులెవరూ మరవలేరని భాజపా సీనియర్‌ నాయకుడు, హుడా అధ్యక్షుడు అశోక్‌ జీరె పేర్కొన్నారు. శనివారం హొసపేటెలోని పార్టీ కార్యాలయంలో అత్యయిక దినోత్సవాన్ని కరాళ దినోత్సవంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అత్యయిక రోజుల్లో ప్రజలు పలు ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ప్రభుత్వం నియంతలా వ్యవహరించిందని వాపోయారు. ఆ రోజులు మళ్లీ ఎప్పటికీ మనకి రాకూడదన్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలు అశోక్‌ జీరెను సత్కరించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు అనంతపద్మనాభ స్వామి, సాలి సిద్ధయ్య స్వామి, అయ్యాళి తిమ్మప్ప, కె.ఎస్‌.రాఘవేంద్ర, శశిధర స్వామి, శంకర్‌ మేటి తదితరులు పాల్గొన్నారు.
కారటగి : తాలూకాలోని బూదగుంప భాజపా కార్యాలయంలో అత్యవసర పరిస్థితికి వ్యతిరేకంగా శనివారం కార్యక్రమం జరిపారు. మొక్కకు నీరు పోసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. పలువురు నాయకులు మాట్లాడుతూ మాజీ ప్రధాని ఇందిరా గాంధీ విధించిన అత్యవసర పరిస్థితి ప్రజాస్వామ్య భారతావనికి చీకటి రోజులు. ఎదురు తిరిగిన వారిని జైళ్లలో పెట్టారు. పత్రికా స్వేచ్ఛను హరించారు. 1975 జూన్‌ 25 నుంచి 21 నెలలపాటు ఈ పరిస్థితి కొనసాగిందన్నారు. ఆ సమయంలో బాధలు అనుభవించిన పలువురిని సత్కరించారు. కార్యక్రమంలో నాయకులు రవిరాజ అరళి, రమేశ్‌ నాడగేర, రవిచంద్ర, మౌనేశ్‌ దడేసుగూరు తదితరులు పాల్గొన్నారు.

హొసపేటె : అత్యయిక పరిస్థితులను గురించి వివరించిన పార్టీ సీనియర్‌ నాయకుడు అశోక్‌ జీరెను

సన్మానిస్తున్న కార్యకర్తలు
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని