logo

లక్ష్య సాధనకు కృషి చేయండి

యువతీ, యువకులు చదువుకునే రోజుల్లోనే స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకున్నప్పుడే అనుకున్నది సాధిస్తారని కర్ణాటక రాష్ట్ర మహిళా కమిషన్‌ అధ్యక్షురాలు ప్రమీళానాయుడు విద్యార్థులకు సూచించారు. శనివారం బళ్లారి సరళాదేవి సతీశ్చంద్ర అగరవాల్‌ డిగ్రీ కళాళాశాలో కమిషన్‌ అధ్యక్షురాలు విద్యార్థులతో సంవాద

Published : 26 Jun 2022 04:46 IST

మాట్లాడుతున్న మహిళా కమిషన్‌ అధ్యక్షురాలు ప్రమీళనాయుడు

బళ్లారి, న్యూస్‌టుడే : యువతీ, యువకులు చదువుకునే రోజుల్లోనే స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకున్నప్పుడే అనుకున్నది సాధిస్తారని కర్ణాటక రాష్ట్ర మహిళా కమిషన్‌ అధ్యక్షురాలు ప్రమీళానాయుడు విద్యార్థులకు సూచించారు. శనివారం బళ్లారి సరళాదేవి సతీశ్చంద్ర అగరవాల్‌ డిగ్రీ కళాళాశాలో కమిషన్‌ అధ్యక్షురాలు విద్యార్థులతో సంవాద కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యువత ఆర్థికంగా బలపడాలి. డిగ్రీ పట్టాలు పొందాలి. బయటకు వచ్చిన తర్వాత స్వావలంబన జీవనం సాగించాలి. రాజ్యాంగంలో అందరికీ సమాన హక్కులు ఉన్నాయి. వాటిని ఉపయోగించుకొని దేశాభివృద్ధికి పాటుపడాలన్నారు. విద్యార్థి జీవితం ఓపికగా.. సరైన మార్గంలో వెళ్లినప్పుడు ఆదర్శవంతమైన వ్యక్తి అవుతారన్నారు. ప్రేమ, అభిమానం అని జీవితాలను నాశనం చేసుకో వద్దని సూచించారు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడిచినా మన దేశం సమానత్వం కోసం పోరాడుతూనే ఉందన్నారు. మహిళలు కేవలం నాలుగు గోడల మధ్య జీవనం గడుపుతున్నారు. మహిళలు కూడా రాజ్యాంగం కల్పించిన హక్కులను ఉపయోగించుకొని జీవితంలో అనుకున్న లక్ష్యాలను చేరుకోవాలన్నారు. అనంతరం స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఉపనిర్దేశకులు విజయ్‌కుమార్‌, కళాశాల ప్రధాన ఆచార్యులు డా.ఆర్‌.ఎం.శ్రీదేవి మాట్లాడారు. కార్యక్రమంలో సీడీసీ సభ్యులు పద్మావతి, శైలజా, అధ్యాపకులు, సిబ్బంది విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు
కేంద్ర కారాగారం పరిశీలన
కర్ణాటక రాష్ట్ర మహిళా కమిషన్‌ అధ్యక్షురాలు ప్రమీళానాయుడు శనివారం మధ్యాహ్నం కేంద్ర కారాగారాన్ని పరిశీలించారు. మహిళా ఖైదీలు ఉంటున్న బ్లాక్‌లను పరిశీలించి, అక్కడ ఖైదీలతో మాట్లాడారు. ఏ కారణాలతో జైలుకు వచ్చారు.. వారు చేసిన తప్పులను తెలుసుకున్నారు. అనంతరం ఖైదీలకు ప్రతినిత్యం అందించే ఆహారం తదితర వాటిని కూడా పరిశీలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని