logo

మెరుగైన సాంకేతికతలకు ప్రాధాన్యం

భారత్‌లో తయారీ, స్కిల్‌ ఇండియా ద్వారా మెరుగైన సాంకేతికతలకు కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్రనాథ్‌ పాండే పేర్కొన్నారు. ఆత్మనిర్భర భారత్‌ దృష్టి కోణానికి అనుగుణంగా పలు సంస్థలు తమ ఉత్పత్తులను తయారు చేస్తున్నాయని తెలిపారు. టయోటా సంస్థ ఇ-డ్రైవ్‌, ఔత్సాహిక అభ్యర్థులకు శిక్షణ తదితరాలకు ఏర్పాటు చేసిన కేంద్రాన్ని మంత్రి అశ్వత్థ నారాయణ,

Published : 27 Jun 2022 02:47 IST

జ్యోతి వెలిగిస్తున్న మహేంద్రనాథ్‌ పాండే, అశ్వత్థనారాయణ, ఎమ్మెల్యే ఎ.మంజునాథ్‌

బెంగళూరు (మల్లేశ్వరం), న్యూస్‌టుడే: భారత్‌లో తయారీ, స్కిల్‌ ఇండియా ద్వారా మెరుగైన సాంకేతికతలకు కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్రనాథ్‌ పాండే పేర్కొన్నారు. ఆత్మనిర్భర భారత్‌ దృష్టి కోణానికి అనుగుణంగా పలు సంస్థలు తమ ఉత్పత్తులను తయారు చేస్తున్నాయని తెలిపారు. టయోటా సంస్థ ఇ-డ్రైవ్‌, ఔత్సాహిక అభ్యర్థులకు శిక్షణ తదితరాలకు ఏర్పాటు చేసిన కేంద్రాన్ని మంత్రి అశ్వత్థ నారాయణ, ఎమ్మెల్యే మంజునాథ్‌లతో కలిసి ఆదివారం ప్రారంభించి మాట్లాడారు. దేశంలో ప్రతిభావంతులకు కొరతలేదని, వారికి కావలసిన నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు ప్రైవేటు సంస్థలు, పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. టయోటా సంస్థ నిర్వహిస్తున్న శిక్షణ శిబిరాలు, సామాజిక సేవా కార్యక్రమాలు, కార్పొరేట్ సామాజిక నిబద్ధతలో భాగంగా విద్యాసంస్థలు, ఆసుపత్రుల నిర్మాణం, అంబులెన్సులు, తాగునీటి సదుపాయాలు కల్పిస్తూ.. ప్రభుత్వం ప్రోత్సహించిందని ఐటీ శాఖ మంత్రి అశ్వత్థ నారాయణ పేర్కొన్నారు. కార్యక్రమంలో టయోటా సంస్థ ప్రతినిధులు విక్రమ్‌ కిర్లోస్కర్‌, కె.ఎన్‌.ప్రసాద్‌, మసకాజు యోశిమురా, ఎమెల్యే ఎ.మంజునాథ్‌, తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని