logo

సూర్యకాంతికి మంచిరోజులు

సూర్యకాంతి విత్తనాలు ఉత్పత్తి చేసేందుకు జాతీయ పాడి అభివృద్ధి మండలి (ఎన్‌డీడీబీ)- కర్ణాటక సహకార నూనె విత్తనాలు ఉత్పత్తిదారుల మహామండలి(కెఓఎఫ్‌) మధ్య ఒప్పందం కుదిరింది. సోమవారం జరిగిన కార్యక్రమంలో కేంద్రమంత్రి

Published : 28 Jun 2022 01:02 IST

కేంద్ర మంత్రి శోభాకరంద్లాజె, రాష్ట్ర మంత్రి బీసీపాటిల్‌ సమీక్షంలో ఒప్పంద పత్రాలు

మార్చుకుంటున్న ఎన్‌డీబీబీ, కెఓఎఫ్‌ ప్రతినిధులు

యశ్వంతపుర, శివాజీనగర, న్యూస్‌టుడే : సూర్యకాంతి విత్తనాలు ఉత్పత్తి చేసేందుకు జాతీయ పాడి అభివృద్ధి మండలి (ఎన్‌డీడీబీ)- కర్ణాటక సహకార నూనె విత్తనాలు ఉత్పత్తిదారుల మహామండలి(కెఓఎఫ్‌) మధ్య ఒప్పందం కుదిరింది. సోమవారం జరిగిన కార్యక్రమంలో కేంద్రమంత్రి శోభాకరంద్లాజె, రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి బీసీ పాటిల్‌ సమక్షంలో రెండు సంస్థల ఉన్నతాధికారులు సంతకాలు చేశారు. ఎన్‌డీడీబీతో పాటు మహామండలి కలిసి సూర్యకాంతి విత్తనాలను ఉత్పత్తి చేస్తారని అందుకోసం 21లక్షల హెక్టార్ల భూమిని గుర్తించినట్లు వ్యవసాయ శాఖ మంత్రి బీసీపాటిల్‌ తెలిపారు. సూర్యకాంతి పంటకు ప్రస్తుతం డిమాండ్‌ పెరిగిందని, దీంతో విత్తనాలకు కొరత ఏర్పడిందన్నారు. రైతులు సూర్యకాంతి పంటను సాగు చేస్తే లాభాలు గడించవచ్చని తెలిపారు. కేంద్ర మంత్రి శోభాకరంద్లాజె మాట్లాడుతూ విత్తనాల కొరత తీర్చేందుకు ఎన్‌డీడీబీ, కేఓఎఫ్‌లు కలిసి ప్రయత్నిస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు. సూర్యకాంతి హైబ్రిడ్‌ కేబీఎస్‌హెచ్‌-4 రకం పంటను సాగు చేస్తే గణనీయంగా లాభాలను గడించొచ్చని తెలిపారు. హైదరాబాద్‌ ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆయిల్‌ సీడ్స్‌ పరిశోధన సంస్థ ఎక్కువ స్థాయిలో సూర్యకాంతి విత్తనాలను ఉత్పత్తి చేస్తుందని గుర్తు చేశారు. కార్యక్రమంలో కేఓఎఫ్‌ అధ్యక్షుడు అణ్ణాసాహేబ్‌ శంకర్‌ జోల్లె, ఎన్‌డీడీబీ అధ్యక్షుడు మీనేశ్‌ షా, బెంగళూరు కృషి విజ్ఞాన విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్‌ రాజేంద్రప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని