logo
Published : 28 Jun 2022 01:02 IST

విరుపాక్షుని సన్నిధిలో యదువీర్‌ ఒడెయార్‌

విరూపాక్షుని ఆలయంలో మైసూరు రాజవంశీకుడు యదువీర్‌ ఒడెయార్‌

హొసపేటె, న్యూస్‌టుడే: మైసూరు రాజవంశీకుడు యదువీర్‌ ఒడెయార్‌ కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం హంపీ విరుపాక్షున్ని దర్శించుకున్నారు. ఉదయం ఆలయం చేరుకున్న ఆయన్ను అర్చకులు పట్టుశాలువా కప్పి సన్మానించారు. అనంతరం ఆయన పేరిట ప్రత్యేక పూజలు చేశారు. విరుపాక్ష ఆలయంలో కొంతసేపు కలియతిరిగిన ఆయన ప్రముఖ స్మారకాలైన సాసివెకాళు, కడలెకాళు గణేశుడు, బడవిలింగ, ఉగ్రనరసింహ, రాణిస్నానగృహం, గజశాలా, కమల్‌ మహల్‌, విజయవిఠల ఆలయం, ఏకశిలా రథాలను తిలకించారు. ఆయనతోపాటు భార్య, కుమారుడు ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

అంజన్న సేవలో..

గంగావతి, న్యూస్‌టుడే: మైసూరు రాజవంశస్థులు యదువీర్‌ కృష్ణదత్త చామరాజ ఒడెయార్‌, ఆయన సతీమణి త్రిషికా కుమారి సోమవారం అంజనాద్రిని దర్శించారు. మెట్లదారిలో కొండపైకి వెళ్లి ఆలయంలో పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంజనాద్రే హనుమంతుని జన్మస్థలమని తమ నమ్మకమన్నారు. అందుకే తాను రెండోసారి అంజనాద్రిని దర్శించిట్లు చెప్పారు. పంపాక్షేత్రమే కిష్కింద. ఇదే హనుమ జన్మస్థానం అన్నది పురాణాల్లో ఉన్నట్లు పేర్కొన్నారు.

Read latest Karnataka News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని