logo
Published : 28 Jun 2022 01:02 IST

అగ్నిపథ్‌ పథకం వెనక్కి తీసుకోవాల్సిందే..!

గడిగి చెన్నప్ప కూడలి నుంచి డీసీ కార్యాలయానికి ప్రదర్శనగా వస్తున్న కాంగ్రెస్‌ కార్యకర్తలు

బళ్లారి, న్యూస్‌టుడే: కేంద్ర ప్రభుత్వం తీసుకుని వచ్చిన అగ్నిపథ్‌ పథకాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ బళ్లారి జిల్లా కాంగ్రెస్‌ పార్టీ నేతృత్వంలో సోమవారం జిల్లా పాలనాధికారి కార్యాలయం ఎదుట కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. డీసీసీ అధ్యక్షుడు మహమ్మద్‌ రఫీక్‌ నేతృత్వంలో గ్రామీణ శాసనసభ్యుడు బి.నాగేంద్ర, మేయర్‌ మోదపల్లి రాజేశ్వరి, ఉప మేయర్‌ మాలన్‌ బీ, స్థాయి సమితి అధ్యక్షులు ఎం.రామాంజనేయులు, రాజశేఖర్‌, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షులు వివేక్‌, అసుండి నాగరాజు, జిల్లా పంచాయతీ మాజీ సభ్యులు ఎ.మానయ్య, ముండరిగి నాగరాజు తదితరులు డీసీ కార్యాలయం వద్దకు చేరుకొని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొని వచ్చిన ‘అగ్నిపథ్‌’ పథకంతో యువకుల భవిష్యత్తుకు భద్రత లేకుండా పోయిందన్నారు. దేశ వ్యాప్తంగా యువకులు శాంతియుతంగా ఆందోళన చేస్తున్నా, వారిపై కేసులు నమోదు చేయడం సరికాదన్నారు. భాజపా అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనూ యువకులు ఆందోళన చేస్తున్నారు. తక్షణమే అగ్నిపథ్‌ పథకం వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్‌ చేశారు. ఆందోళనలో సభ్యులు రామ్‌ప్రసాద్‌, అల్లాబకాష్‌, అయాజ్‌ అహమ్మద్‌, కుమారమ్మ, శ్రీనివాసులు, విష్ణువర్ధన్‌, అంజని, సూర్యనారాయణ, ఈరనగౌడ, కార్పొరేటర్లు ముల్లంగి నందీష్‌, ముండ్లూరు ప్రభంజన్‌కుమార్‌, గాదెప్ప, వెంకటేశ్‌ హెగ్డె, ఎల్‌.మారెణ్ణ, మన్నెం శ్రీధర్‌ పాల్గొన్నారు.
 

Read latest Karnataka News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని