logo

ప్రభుత్వ గోశాల ప్రారంభం

రాష్ట్రంలో ప్రభుత్వ తొలి గోశాల జిల్లాలోని కడూరు తాలూకా ఎమ్మెదొడ్డి గ్రామంలో సోమవారం ఆరంభమైంది. రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి ప్రభు చౌహాన్‌ దీన్ని ప్రారంభించారు. జిల్లాకు ఓ గోశాల

Published : 28 Jun 2022 01:02 IST

తొలి గోశాలను ప్రారంభించి ఆవుకు మేత తినిపిస్తున్న మంత్రి ప్రభు చౌహాన్‌

చిక్కమగళూరు, న్యూస్‌టుడే : రాష్ట్రంలో ప్రభుత్వ తొలి గోశాల జిల్లాలోని కడూరు తాలూకా ఎమ్మెదొడ్డి గ్రామంలో సోమవారం ఆరంభమైంది. రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి ప్రభు చౌహాన్‌ దీన్ని ప్రారంభించారు. జిల్లాకు ఓ గోశాల పథకంలో భాగంగా దీన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. దాదాపు 11 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటైంది. దీని నిర్మాణ, నిర్వహణకు రూ.53.50 లక్షలను వ్యయం చేశారు. ఈ గోశాలలో 150 గోవులు ఉండటానికి సదుపాయాలున్నాయి. ప్రతి 20 గోవులకు ఒక కాపరిని నియమించారు. గోవుల దత్తత కార్యక్రమాన్ని వచ్చే నెలలో ప్రారంభించనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఒక్కో గోవును ఏడాది పాటు దత్తత తీసుకునేందుకు రూ.11 వేలను చెల్లించాలి. పుణ్యకోటి పథకం పేరుతో దత్తత కార్యక్రమాన్ని కొనసాగిస్తారు. ప్రతి జిల్లాలో కూడా గోశాలల్ని ఏర్పాటు చేయడం ద్వారా అక్రమంగా కబేళాలకు తరలించడాన్ని నివారించవచ్చని అన్నారు.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు