logo

గంజాయి దహనం

అంతర రాష్ట్రీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా బళ్లారి, విజయనగర జిల్లాలో పోలీసులు స్వాధీనం చేసుకున్న 89.670 కిలోల గంజాయిని ఆదివారం కాల్చివేశారు. ఉమ్మడి జిల్లాలో అక్రమంగా గంజాయి తరలిస్తున్న వారిపై ప్రత్యేక నిఘా పెట్టి, 30

Published : 28 Jun 2022 01:02 IST

బళ్లారి, న్యూస్‌టుడే: అంతర రాష్ట్రీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా బళ్లారి, విజయనగర జిల్లాలో పోలీసులు స్వాధీనం చేసుకున్న 89.670 కిలోల గంజాయిని ఆదివారం కాల్చివేశారు. ఉమ్మడి జిల్లాలో అక్రమంగా గంజాయి తరలిస్తున్న వారిపై ప్రత్యేక నిఘా పెట్టి, 30 కేసులు నమోదు చేశారు. రూ.10,97,872 విలువైన 89.670 కిలోల గంజాయి, రూ.5.70లక్షలు విలువైన 11 గ్రాముల ఎల్‌.ఎస్‌.డి.ని పట్టుకున్నారు. ఎస్పీ సైదులు అడావత్‌ ఆదేశాలతో, నగర డీఎస్పీ రమేష్‌కుమార్‌ నేతృత్వంలో పోలీస్‌ అధికారులు విశ్వనాథ కులకర్ణి తదితరులు బళ్లారి తాలూకా హరగినడోణి గ్రామం సమీపంలోని బయో మెడికల్‌ వ్యర్థాల ప్లాంట్‌లో కాల్చివేశారు.

చెళ్లకెరె(చిత్రదుర్గం): మొళకాల్మూరు తాలూకాలో రెండేళ్ల క్రితం పోలీసులు స్వాధీనం చేసుకొన్న 9.83 టన్నుల గంజాయి మొక్కలను దావణగెరె తూర్పు వలయం ఐజీపీ త్యాగరాజన్‌ నేతృత్వంలో పోలీసు అధికారులు రాంపుర గ్రామం వద్ద గల వ్యర్థపదార్థాల నిర్వహణ కేంద్రంలో దహనం చేసినట్లు జిల్లా ఎసీˆ్ప పరశురాం తెలిపారు. సోమవారం ఆయన తెలిపిన వివరాల మేరకు.. నాశనం చేసిన గంజాయి విలువ సుమారు రూ.4.01 కోట్లని చెప్పారు. దీంతోపాటు జిల్లాలో 5 ప్రత్యేక సంఘటనల్లో స్వాధీనం చేసుకొన్న 9.87 కిలోల గంజయిని కూడా దహనం చేసి నాశనం చేశామన్నారు. డీవైఎస్పీ శ్రీధర్‌, సీఐ సతీశ్‌, ఎస్‌ఐ గాదిలింగప్ప, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని