logo

సందడి చేసిన నిఖత్‌ జరీన్‌

తెలంగాణ బాక్సింగ్‌ సంచలనం నిఖత్‌ జరీన్‌ మంగళవారం బెంగళూరులో సందడి చేశారు. స్థానిక బ్రిగేడ్‌ రోడ్డులో నూతనంగా అడిడాస్‌ షోరూం ప్రారంభించారు. ఈ షోరూంలో ఏర్పాటు చేసిన అద్దాలను తన పదునైన బాక్సింగ్‌ పంచులతో పగలగొట్టి షోరూంకు స్వాగతం పలికారు.

Published : 29 Jun 2022 03:49 IST


బాక్సింగ్‌ పంచులు విసురుతున్న నిఖత్‌

ఈనాడు, బెంగళూరు : తెలంగాణ బాక్సింగ్‌ సంచలనం నిఖత్‌ జరీన్‌ మంగళవారం బెంగళూరులో సందడి చేశారు. స్థానిక బ్రిగేడ్‌ రోడ్డులో నూతనంగా అడిడాస్‌ షోరూం ప్రారంభించారు. ఈ షోరూంలో ఏర్పాటు చేసిన అద్దాలను తన పదునైన బాక్సింగ్‌ పంచులతో పగలగొట్టి షోరూంకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఓ మహిళగా ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకోవటం ఎంతో ఆనందంగా ఉన్నా ఆ ఆనందం వెనుక తండ్రి కష్టం ఉందన్నారు. నేను భారతదేశం గర్వించదగ్గ బాక్సర్‌గా ఎదిగానంటే మొండిపట్టుదల కూడా కారణమన్నారు. ‘పురుషుల ఆధిపత్యం ఉండే క్రీడలో నేను ఏనాడూ అభద్రతకు లోనుకాలేదు. నన్ను ఎందరో ఈ క్రీడలో రాణించటం కష్టమని ఎద్దేవా చేశారు. నేను వారి మాటలను ఖాతరు చేయలేదు. నేనెప్పుడూ మహ్మద్‌ ఆలీ, మైక్‌టైసన్‌ల క్రీడా నైపుణ్యాన్ని వీడియోల్లో చూస్తూ నేర్చుకున్నా. పురుషులే ప్రత్యర్థులకు గట్టి పంచులు వేయగలరన్న భావన నాలో రాకుండా జాగ్రత్తపడుతుండేదానిని. ఈ మొండి ధైర్యమే భారత్‌కు స్వర్ణ తెచ్చిన మహిళా బాక్సర్ల జాబితాలో నన్ను నిలిపింది. ఇదే లక్ష్యంతో సాధన చేస్తే మహిళలు ఏదైనా సాధించగలరు’ అని నిఖత్‌ యువతకు పిలుపునిచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని