logo

బొమ్మై నివేదిక భళా!

దేశ ప్రజలంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 47వ జీఎస్‌టీ మండలి సమావేశంలో తొలిరోజు కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై తనదైన నిపుణతతో అందరినీ మెప్పించారు. మండలి సమావేశాన్ని చండీగఢ్‌లో మంగళవారం ప్రారంభించగా..

Published : 29 Jun 2022 03:49 IST


జీఎస్టీ సభలో ముఖ్యమంత్రి బొమ్మై

ఈనాడు, బెంగళూరు : దేశ ప్రజలంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 47వ జీఎస్‌టీ మండలి సమావేశంలో తొలిరోజు కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై తనదైన నిపుణతతో అందరినీ మెప్పించారు. మండలి సమావేశాన్ని చండీగఢ్‌లో మంగళవారం ప్రారంభించగా.. జీఎస్‌టీ మంత్రుల బృందం (గ్రూప్‌ ఆఫ్‌ మినిస్టర్‌-జీఓఎం) మధ్యంతర నివేదికను బొమ్మై సమర్పించడం ప్రస్తావనార్హం. పేరుకు భాజపా పాలిత రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నా.. జీఎస్‌టీ అంశంలో అన్ని రాష్ట్రాల అవసరాన్ని గుర్తించి స్పందించారు. రాష్ట్రాల ప్రభుత్వాలు వేరైనా పన్నులు చెల్లించే ప్రజలంతా ఒక్కటే అన్న భావనను సమావేశంలో అందరికీ తెలిసొచ్చేలా చేయటం విశేషం. గతేడాది నవంబరులో లక్నోలో నిర్వహించిన ఇదే తరహా సమావేశంలో జీఓఎం ఏర్పాటు చేయాలని తీర్మానించారు. ఈ తీర్మానం మేరకు ముఖ్యమంత్రి బొమ్మై నేతృత్వంలో జీఓఎం రూపుదిద్దుకుంది. ఈ ఏడాది కాలంలో మొత్తం మూడు సమావేశాలు నిర్వహించారు. ఇందులో పశ్చిమ్‌ బంగా, బీహార్‌, కేరళ, రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌, గోవా రాష్ట్రాల ఆర్థిక మంత్రులు సభ్యులుగా ఉన్నారు. వీరిలో భాజపాయేతర ప్రభుత్వాలూ ఉన్నాయి. ఈ బృందం పన్నుల ధరల హేతుబద్దీకరణపై సమీక్ష చేపట్టేందుకు సిద్ధమైంది. మూడు సమావేశాల్లో చేపట్టిన చర్చల ద్వారా రూపొందించిన మధ్యంతర నివేదికను మంగళవారం చండీగఢ్‌లో బొమ్మై సమర్పించారు. కార్యక్రమంలో సీఎం రాజకీయ కార్యదర్శి మంజునాథ్‌ ప్రసాద్‌, వాణిజ్య పన్నుల శాఖ ఏసీఎస్‌ సి.శిఖా పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని