logo

ఆరు నెలలు.. 60 సినిమాలు!

మరికొన్ని రోజులు గడిస్తే ఏడాదిలో అప్పుడే ఆరునెలలు పూర్తైనట్లే. కరోనా ఆంక్షల నుంచి గట్టెక్కిన తరువాత చందనసీమకు పూర్వవైభవం లభిస్తుందని భావించిన సినీ వర్గాలకు ఆశించిన స్థాయిలో తృప్తి లభించలేదు. ఆరు నెలల్లో 60కిపైగా సినిమాలు విడుదలైనా ఇందులో నిర్మాతను ఆదుకున్నవి నాలుగంటే నాలుగు.

Published : 29 Jun 2022 04:07 IST

ఆదుకున్నవి మాత్రం నాలుగే


‘జేమ్స్‌’లో పునీత్‌రాజ్‌కుమార్‌

బెంగళూరు (ఎలక్ట్రానిక్‌ సిటీ), న్యూస్‌టుడే : మరికొన్ని రోజులు గడిస్తే ఏడాదిలో అప్పుడే ఆరునెలలు పూర్తైనట్లే. కరోనా ఆంక్షల నుంచి గట్టెక్కిన తరువాత చందనసీమకు పూర్వవైభవం లభిస్తుందని భావించిన సినీ వర్గాలకు ఆశించిన స్థాయిలో తృప్తి లభించలేదు. ఆరు నెలల్లో 60కిపైగా సినిమాలు విడుదలైనా ఇందులో నిర్మాతను ఆదుకున్నవి నాలుగంటే నాలుగు. మిగిలినవి ఎప్పుడు విడుదలయ్యాయో.. ఎప్పుడు బాక్సాఫీస్‌ను చేరుకున్నాయో కూడా తెలియదని ప్రేక్షకులే అంగీకరిస్తున్నారు. నిర్మాతలను ఆదుకున్నట్లుగా చెబుతున్న ఆ నాలుగు సినిమాల్లో కే.జీ.ఎఫ్‌2 సినిమా ఖండాంతరాలు దాటుకుని ప్రపంచ సినిమా స్థాయికి చేరుకుంది. ఒకప్పుడు చందనసీమలో సినిమాలు రూ.పది కోట్ల క్లబ్‌లో చేరితే అందరూ అదో గొప్ప విషయంగా భావించేవారు. ‘ముంగారుమళె’ సినిమా విడుదలైన సందర్భంలో దానికి లభించిన ఆదరణను ఇప్పటికీ చర్చించుకుంటారు. ఆ సినిమా తరువాత రూ.100 కోట్ల క్లబ్‌లో చేరే సినిమాల్ని లెక్కించేవారు. ఈ ఏడాది విడుదలైన కే.జీ.ఎఫ్‌.2 సినిమా బారతీయ సినిమా రంగంలోనే అగ్రస్థానాన్ని చేరుకుని ఇతర భాషల సినీ రంగాలు కన్నడ చిత్రసీమవైపు చూసేలా చేసింది. ఈ సినిమా ఏకంగా రూ. 1250 కోట్లను వసూలు చేసి ఇప్పట్లో మరే సినిమా కూడా అందనంత ఎత్తుకు చేరుకుంది. ఆ సినిమా అనంతరం చిత్రసీమలో ఒకవిధంగా విచిత్రమైన పరిస్థితి నెలకొంది. ఏసినిమా గురించి ప్రస్తావించినా కేజీఎఫ్‌ గురించి ముందుగా ప్రస్తావిస్తున్నారట. దీన్ని చూసిన తరువాత ఇతర సినిమాల్ని చూసేందుకు వెనుకంజ వేస్తున్నారని చెబుతారు. ఈ నేపథ్యంలోనే ఇతర సినిమాల్ని థియేటర్లలో చూసేందుకు విముఖత చూపుతున్నారు. అందుకే హౌస్‌ఫుల్‌ బోర్డులను థియేటర్ల ఎదుట చూసి ఎంతో కాలమైందని అంటారు. ఈ ఏడాదిలో కే.జీ.ఎఫ్‌.2, జేమ్స్‌, చార్లీ సినిమాలు ఘన విజయం సాధించగా లవ్‌మ్యాక్‌టైల్‌-2 సినిమా నిర్మాతను ఆర్థికంగా ఆదుకుంది. థియేటర్లకు ప్రేక్షకుల్ని ఆకర్షించే సినిమాలపై దృష్టి సారించాలని సినీ పరిశ్రమకు చెందిన అనేకమంది నిర్మాతలను కోరారు.


‘కేజీఎఫ్‌.2’లో యశ్‌

 


‘చార్లీ’లో రక్షిత్‌శెట్టి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని