logo
Published : 30 Jun 2022 00:46 IST

కన్నవారికే టోకరా!

వరుణ్‌ నాయక్‌

ఉడుపి, న్యూస్‌టుడే : కన్నవారి నుంచి డబ్బు లాగేందుకు ఓ యువకుడు కిడ్నాప్‌ డ్రామాకు సిద్ధమై.. చివరికి చేతులు కాల్చుకున్నాడు. అసలు విషయాన్ని పోలీసులు వెలుగులోకి తేవడంతో ప్రస్తుతం కటకటాల్ని లెక్కిస్తున్నాడు. ఈసంఘటన ఉడుపి జిల్లా పుత్తూరు పంచాయతీ పరిధిలోని అంబాగిలు గ్రామంలో ఆలస్యంగా వెలుగు చూసింది. ఇటీవల వరుణ్‌ నాయక్‌ అనే యువకుడు తన తల్లిదండ్రుల నుంచి డబ్బులాగేందుకు ఓ నాటకమాడాడు. ఇంటికి ఫోన్‌ చేసి తనను ఎవరో కిడ్నాప్‌ చేశారని- బయటపడాలంటే రూ.5 లక్షలు కావాలని ఈనెల 26న తెల్లవారుజామున మూడు గంటల సమయంలో ఇంటికి ఫోన్‌ చేశాడు. తీవ్ర ఆందోళనకు గురైన తల్లిదండ్రులు ఈ విషయాన్ని వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కిడ్నాపర్లను ఆటకట్టించడంతో పాటు అపహరణకు గురైన యువకుడిని రక్షించాలని పోలీసులు ప్రత్యేక బృందాల్ని ఏర్పాటు చేశారు. మొబైల్‌ ఫోన్‌ కాల్‌ ఎక్కడి నుంచి వచ్చిందో సిగ్నల్స్‌ ఆధారంగా గుర్తించారు. అది గోవా నుంచి వచ్చినట్లు తెలుసుకుని అక్కడకు వెళ్లారు. గోవాలో గాలించే సమయంలో నిందితుడు ఒక్కో ప్రాంతం నుంచి ఒక్కోసారి ఫోన్‌ చేసి వారిని తికమకపట్టించాడు. చివరకు క్యాసినోలో స్నేహితులతో కలిసి మజా చేస్తుండగా బంధించారు. స్థానిక న్యాయస్థానం ఎదుట హాజరు పరచగా 15 రోజుల కస్టడీ విధించారు. విలాసాల కోసమే కిడ్నాప్‌ డ్రామా చేశానని అంగీకరించాడు.

Read latest Karnataka News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని