logo

లండన్‌లో అప్ప సందడి

తన కుటుంబ సభ్యులతో కలిసి లండన్‌ పర్యటనలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి యడియూరప్పతో బుధవారం అక్కడి ప్రవాస కన్నడ సమావేశాలు సమావేశమయ్యారు. లండన్‌లోని ఎంటీఆర్‌ హోటల్‌కు తన చిన్నకుమారుడు

Published : 30 Jun 2022 00:46 IST

ఓ హోటల్‌ వెలుపల కుమారుడు, కన్నడిగులతో యడియూరప్ప

బెంగళూరు (గ్రామీణం), న్యూస్‌టుడే: తన కుటుంబ సభ్యులతో కలిసి లండన్‌ పర్యటనలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి యడియూరప్పతో బుధవారం అక్కడి ప్రవాస కన్నడ సమావేశాలు సమావేశమయ్యారు. లండన్‌లోని ఎంటీఆర్‌ హోటల్‌కు తన చిన్నకుమారుడు విజయేంద్రతో కలిసి వెళ్లి అల్పాహారాన్ని తీసుకున్నారు. అదే సమయంలో అక్కడకు వచ్చిన కన్నడిగులతో మాట్లాడారు. వారితో కలిసి ఫొటో దిగారు. తొలుత ఐదు రోజులే లండన్‌లో ఉండాలని జూన్‌ 21న ఇక్కడి నుంచి వెళ్లిన అప్ప.. పర్యటనను కాస్తా పొడిగించారు. జులై 8న బెంగళూరుకు తిరిగి వస్తానని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని