logo

కాషాయ దండు నిరసన జెండా

ఉదయపూర్‌లో దుండగుల చేతిలో శిరచ్ఛేధానికి గురైన కన్నయ్య లాల్‌ అనే దర్జీకి మద్దతుగా బెంగళూరులోని వివిధ కన్నడ సంఘాలు ధర్నాకు దిగాయి. వీహెచ్‌పీ, హిందూ జాగరణ సమితి ప్రతినిధులు టౌన్‌హాల్‌తో భాజపా ఎమ్మెల్యేలు ఉన్న

Published : 30 Jun 2022 00:46 IST

కన్నయ్యలాల్‌ హత్యను ఖండిస్తూ టౌన్‌హాల్‌ వద్ద ధర్నాలో హిందూ జాగరణ సమితి కార్యకర్తలు

బెంగళూరు (శివాజీనగర), న్యూస్‌టుడే : ఉదయపూర్‌లో దుండగుల చేతిలో శిరచ్ఛేధానికి గురైన కన్నయ్య లాల్‌ అనే దర్జీకి మద్దతుగా బెంగళూరులోని వివిధ కన్నడ సంఘాలు ధర్నాకు దిగాయి. వీహెచ్‌పీ, హిందూ జాగరణ సమితి ప్రతినిధులు టౌన్‌హాల్‌తో భాజపా ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో ధర్నా, నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. టౌన్‌హాల్‌ వరకు భాజపా కార్యకర్తలు ప్రదర్శన నిర్వహించారు. ధర్నా చేస్తున్న సమయంలో జోరుగా కురిసిన వర్షాన్నీ ఆందోళనకారులు లెక్క పెట్టలేదు. అవాంఛనీయ ఘటనలకు తావివ్వకుండా ఆందోళనకారులు ఉన్న చోటే పోలీసులు విధులు నిర్వహించారు. ఘర్షణలకు అవకాశం ఉన్నచోట్ల భద్రతను కట్టుదిట్టం చేశారు. వదంతులను విశ్వసించవద్దని పోలీసులు విజ్ఞప్తి చేశారు. అవసరానికి అనుగుణంగా శాంతిసభలను నిర్వహించాలని పోలీసుల అధికారులు నిర్ణయించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని